
11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి విజయాలు అందుకుంటారు. మనసు మార్చుకోవడం ద్వారా ఇబ్బందులొస్తాయి. ఆంజనేయ స్వామి దర్శనం శుభం కలిగిస్తుంది.
వ్రషభ రాశి వారికి గొడవలకు దూరంగా ఉండండి. చేసే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆచితూచి వ్యవహరించాలి. వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మచి ఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి వారికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. గొడవలకు పోకుండా ఉండటమే మంచిది. వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభాలు ఇస్తుంది.
కర్కాటక రాశి వారికి మనోధైర్యంతో ముందుకు వెళతారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శివారాధన చేయడం ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది.
సింహ రాశి వారికి అనుకూల కాలం. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నష్టం. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. దుర్గారాధన చేయడం మంచిది.
కన్య రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈశ్వర దర్శనం శ్రేయస్కరం.
తుల రాశి వారికి అనవసర ఖర్చులుంటాయి. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కనకధారాస్తవం చదవడం మేలు కలిగిస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. సకాలంలో పనులు పూర్తి చేసుకుంటారు. ఇష్టదేవతారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
ధనస్సు రాశి వారికి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. లక్ష్మీదేవి ఆరాధన మంచి చేస్తుంది.
మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ప్రయాణాల్లో లాభాలుంటాయి. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ఇష్టదేవతారాధన మేలు కలిగిస్తుంది.
కుంభ రాశి వారికి గొడవలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
మీన రాశి వారికి సంఘంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. గొడవలకు పోవద్దు. మానసికంగా బలంగా ఉంటారు. ఇష్టదేవతారాధన చేయడం శుభకరం.