34.5 C
India
Monday, May 6, 2024
More

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Date:

    Canada
    Canada

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల విదేశాల్లో ఉద్యోగం చేయడం. అమెరికా, కెనడా, యూకే లాంటి దేశాల్లో మంచి జీతంతో ఉద్యోగం చేయాలని తహతహలాడుతుంటారు. తల్లిదండ్రులు కూడా ఇదే ఆలోచనగా ఉంటారు. ‘‘తమ వాడు అమెరికాలో ఉన్నాడు..తమ అమ్మాయి కెనడాలో ఉంది..’’ అని చుట్టాలతో చెప్పుకోవడానికి గర్వపడుతుంటారు. పిల్లలను విదేశాల్లో స్థిరపడేలా చేసేందుకు స్థోమత లేకపోయినా లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. భారత్ లో పుట్టిన సగటు తల్లిదండ్రుల ఆలోచన అంతా ఇదే.

    అయితే కెనడా, అమెరికాల్లో పరిస్థితులు బాగోలేవని కెనడాలో 25 సంవత్సరాల కిందట సెటిల్ అయిన ఓ తెలుగు వ్యక్తి ఓ వీడియో ద్వారా విన్నవించగా..ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే..‘‘నేను కెనడాలో పడని కష్టం లేదు. జీరో నుంచి హై పొజిషన్ లో ఉన్నాను. అయితే ప్రస్తుతం కెనడాలో ఉద్యోగాలు లేవు. రెఫరెన్స్ తో కూడా ఉద్యోగాలు లేవు. ఇక్కడి ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. అలాగే లివింగ్ కాస్ట్, నిత్యావసర సరుకుల ఖర్చులు, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతున్నాయి. పేద, మధ్య తరగతి భారత తల్లిదండ్రులు మీ పిల్లలను కెనడా, అమెరికాకు పంపించవద్దు. వీటి కంటే యూకే మోస్తారుగా ఉంది.’’ అంటూ చెప్పుకొచ్చాడు.

    కెనడా ప్రధాని ట్రూడో చేసిన పనుల వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని సదరు వ్యక్తి ఆ వీడియోలో గోడు వెల్లబోసుకున్నాడు. విపరీత వలసల వల్ల కెనడాలో ఉద్యోగాలు పోతున్నాయని, ఈ విషయంపై సీరియస్ గా పట్టించుకోవాలని కెనడా రాజకీయ నాయకులకు సూచించారు. పార్ట్ టైం ఉద్యోగాలు కూడా లేవన్నారు. కెనడా మార్కెట్ డెడ్ అయ్యిందని చెప్పారు. కెనడాలో ఉద్యోగం చేద్దామనుకునే భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితువు పలికారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు,...