
Today Horoscopes 16th January : మేష రాశి వారికి అనవసర ఖర్చులుంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. హనుమాన్ ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
వ్రషభ రాశి వారికి మంచి విజయాలు దక్కుతాయి. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనికొస్తాయి. విష్ణు దర్శనం ఎంతే మేలు చేస్తుంది.
మిథున రాశి వారికి అధికారుల అండ ఉంటుంది. మానసికంగా బలంగా ఉంటారు. బంధు మిత్రుల సహకారం లభిస్తుంది. దుర్గాదేవి దర్శనం మంచిది.
కర్కాటక రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. సలహాలు పాటిస్తే మంచిది. మీ ఆలోచనలను కార్యరూపంలో పెట్టండి. వెంకటేశ్వర స్వామిని కొలవడం ఉత్తమం.
సింహ రాశి వారికి ఉల్లాసంగా ఉంటారు. ప్రతి విషయాన్ని చర్చించి అమలు చేయడం మంచిది. లక్ష్మీ సహస్ర నామాలు చదువుకుంటే శ్రేయస్కరం.
కన్య రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రణాళికబద్ధంగా ముందడుగు వేయండి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. గోవింద నామాలు జపించడం శుభకరం.
తుల రాశి వారికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఆదర్శంగా నిలుస్తారు. పరిచయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన అనుకూలంగా ఉంటుంది.
వ్రశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులుంటాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీరామ నామం జపించడం మంచిది.
ధనస్సు రాశి వారికి మనోధైర్యం కోల్పోవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంది. ఇతరుల సలహాలు, సూచనలు స్వీకరించాలి. దైవారాధన చేయడం మేలు.
మకర రాశి వారికి ప్రయాణాల్లో లాభాలున్నాయి. కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. అనుకూల సమయం. గణపతి ఆరాధన శుభాలు కలిగిస్తుంది.
కుంభ రాశి వారికి మనోబలం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. శ్రమ ఎక్కువవుతుంది. గొడవలకు దిగడం మంచిది కాదు. ఇష్టదేవతారాధన బాగుంటుంది.
మీన రాశి వారికి మానసికంగా సంతోషంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్ర నామాలు చదవడం మంచిది.