
Viral Video : పెంపుడు జంతువుల్లో అత్యంత విశ్వాసం గలది కుక్క. యజమాని కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెడుతుంది. దీంతో శునకం అనేది ఇంటిలోకి వచ్చేసింది. మానవుడు నాగరిక జీవితానికి అలవాటు పడ్డప్పటి నుంచి కుక్కలను పెంచుకోవడం మొదలు పెట్టాడు. దీంతో అవి మానవులతో కలిసి జీవించడం మొదలుపెట్టాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటిని కాపలా కాస్తూ అవి కూడా నాగరిక జీవనానికి పడ్డాయి.
పెట్ జంతువుగా ఉన్న డాగ్ ఇప్పుడు ప్రతీ ఇంటిలో భాగంగా మారింది. దీంతో ఇంట్లో వాళ్లు ఏం చేసినా అవి కూడా చూసి అనుసరిస్తున్నాయి. యజమాని బయటకు వెళ్తుంటే తమను కూడా తీసుకెళ్లాలని చిన్న పిల్లవాడి మల్లే మారాం చేస్తున్నాయి. ఇక బజారుకు వస్తే బాధ్యతగా యజమానికి ఏదో ఒక పని చేస్తుంది. ఇలా ప్రతీ విషయంలో డాగ్ మనుషులను అనుసరిస్తూనే ఉంది.
ఇప్పుడు యజమానులు కుక్కలకు స్పీకింగ్ థెరపీ చేస్తున్నారు. స్వతహాగానే అవి వింటున్నవి అర్థం చేసుకుంటుంది. యజమాని పిలుపు, వాయిస్, ఇంట్లో ఉండే వ్యక్తుల వాయిస్ ను గుర్తు పడుతుంది. ఇలా ప్రతీ విషయంలో యజమానులను అనుసరిస్తున్నాయి పెట్స్. అయితే.. ఈ మధ్య కొందరు పెట్ యజమానులు వాటికి సింగింగ్ థెరపీ ఇస్తున్నారు. దీంతో కొన్ని పెట్స్ పాటకు తగ్గట్లుగా అరవడం, కూని రాగాలు తీయడం చేస్తున్నాయి.
ఇక్కడ శునకం చేసే కూనిరాగం వింటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుండడంతో అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.