
10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. ఆంజనేయ స్వామిని జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
వ్రషభ రాశి వారికి గొడవలకు వెళ్లడం మంచిది కాదు. ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
మిథున రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. చేసే పనులు సజావుగా చేయాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
కర్కాటక రాశి వారికి మనోబలం పెరుగుతుంది. ఆరోగ్యం కాపాడుకోవాలి. ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా ముందడుగు వేస్తారు. శివారాధన శుభకరం.
సింహ రాశి వారికి మనోధైర్యంతో ఉంటారు. గొడవలకు దిగడం మంచిది కాదు. తప్పుడు నిర్ణయాలు తీసకోవద్దు. దుర్గారాధన చేయడం మేలు కలిగిస్తుంది.
కన్య రాశి వారికి సమాజంలో సరైన గుర్తింపు లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈశ్వర దర్శనం శుభకరం.
తుల రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక సంఘటన మీలో ఆందోళన కలిగిస్తుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. కనకధారాస్తవం చదవడం మంచిది.
వ్రశ్చిక రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. ఆనందంగా కాలం గడుపుతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇష్టదేవతారాధన చేయడం లాభాలు తెస్తుంది.
ధనస్సు రాశి వారికి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
మకర రాశి వారికి కొన్ని సంఘటనలు ఉత్సాహం పెంచుతాయి. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.
కుంభ రాశి వారికి అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక లాభాలున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి లాభాలున్నాయి.
మీన రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గొడవలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతారాధన మంచి చేస్తుంది.