32.8 C
India
Thursday, May 9, 2024
More

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Date:

    Revanth
    Modi, KCR and Revanth

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు రాష్ట్రంలో ఉనికి లేకుండా చేయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులను చేర్చుకోడానికి ప్రత్యేకంగా పలువురు కాంగ్రెస్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా గులాబీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా నియోజక వర్గాల్లో పావులు కదుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే విధంగా బీజేపీ స్థానాలు కూడా గతంలో కంటే తక్కువ వచ్చేలా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఆ పార్టీని ఎండగడుతున్నారు. మోదీ ఇచ్చిన గత హామీలనే లక్ష్యంగా చేసుకొని బీజేపీ శ్రేణులను ఇరుకున పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కడై అన్నీ తానై ఒకవైపు కేసీఆర్, మరోవైపు మోదీ ని టార్గెట్ చేసి ఏకధాటిగా తన అస్త్రాలను వారిపై విసురుతున్నారు.

    ప్రజలకు ఇచ్చిన హామీల్లో వంద రోజుల్లోనే ఐదింటిని అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తూ ప్రజలకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి అమలు చేశారు. ఆ పథకాన్ని కొనసాగకుండా కేసీఆర్ కుట్రపన్ని నిర్లక్ష్యం చేశాడని విమర్శలు ఎక్కుపెట్టారు .అర్హులైన కుటుంబాలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచాడని విమర్శిస్తున్నార సీఎం రేవంత్. కేవలం తన కొడుకు, అల్లుడు, కూతురు కే ఉద్యోగులు వచ్చాయన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా  ఉద్యోగాలు నియమించడంలో కేసీఆర్ చేతకాని తనంలో ప్రశ్నపత్రాలు అంగడి సరుకుల బయటకు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.

    పదేళ్లు అధికారం అప్పగిస్తే దేశంలో సంస్థలను అమ్ముకొస్తున్న మోదీ మనకు అవసరమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.  మరోసారి అధికారం రాగానే రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికి కూడా కుట్ర పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ అధికారంలో ఉండాలన్నారు. ఆంధ్ర ప్రాంతంలో పార్టీ కి నష్టం జరుగుతుందని తెలిసీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్నారు. కానీ రాష్ట్రంలో మోదీ ఒక్క పరిశ్రమ కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    KCR : కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ బిగ్ స్కెచ్!

    KCR : చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. అధికారంలో...

    Revanth Reddy : తెలంగాణపై భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్.. రేవంత్ రెడ్డితో అవుతుందా?

    CM Revanth Reddy : కాంగ్రెస్ ముందు మరో సవాలు ఎదురవుతోంది....

    BRS : బీఆర్ఎస్ కు అసలు ముప్పు ముందుందా?

    BRS Party : లోక్ సభ ఎన్నికల్లో గెలవాలని మూడు పార్టీలు...