31 C
India
Monday, May 20, 2024
More

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Date:

    Kartika Deepam Actress
    Kartika Deepam Actress

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కామన్ అని మనకు తెలిసిందే. టాప్ హీరోయిన్లకే కాదు చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఇది తప్పదు. ఆఖరికి 60ఏండ్ల ఆర్టిస్టులను కూడా వదలడం లేదు. పడక గదిలోకి వస్తేనే మంచి పాత్రలు ఇవ్వడం..వారి కెరీర్ ను బిల్డ్ చేయడం లాంటివి చేసేవారు.  కొందరు కెరీర్ కోసం  లొంగిపోయేవారు. మరికొందరు అలాంటి వారికి దూరంగా ఉండేవారు. అవసరమైతే ఫీల్డ్ నే వదులుకునేవారు.  కానీ ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ అందరూ బయటకు వచ్చి ధైర్యంగా చెప్తున్నారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తున్నారు.

    తాజాగా కార్తీక దీపం సీరియల్ నటికి సైతం లైంగిక వేధింపులు తప్పలేదు. బుల్లితెరపై అమూల్య గౌడకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కార్తీక దీపం సీరియల్ మొదట్లో అమూల్యకు మంచి ప్రాధాన్యం ఉండేది. ఆ తర్వాత కథలో ఆమె పాత్ర తగ్గిపోతూ వచ్చింది. ప్రస్తుతం అమూల్య గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో నటిస్తోంది.

    అమూల్య గౌడ తాజాగా లైంగిక వేధింపులకు గురైంది. తనకు సూర్య అనే వ్యక్తి చాన్స్ లు ఇస్తానని చెప్పి.. లైంగిక వేధింపులకు గురి చేశాడని అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. సూర్య అనే వ్యక్తి కాస్టింగ్ డైరెక్టర్ గా పరిచయం చేసుకున్నాడని, తనను ఆడిషన్ కు పిలిచి వెళ్లి వచ్చాక అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతున్నాడని, లైంగికంగా వేధించడంతో తాను అతడిని నిలదీశానని చెప్పుకొచ్చింది. దీంతో అతడు తనను పోలీసులకు చెప్పుకుంటే చెప్పుకో పో అంటూ బెదిరించారని తెలిపింది. అతడికి బుద్ధి చెప్పి తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. దీంతో సూర్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related