35.5 C
India
Wednesday, May 8, 2024
More

    Jai shreeram : పరీక్షల్లో జైశ్రీరామ్ అని రాసినందుకు ఫస్ట్ క్లాస్ లో పాస్ చేశారు..యూపీ ప్రొఫెసర్ల నిర్వాకం

    Date:

    Jai shreeram
    Jai shreeram Answer Sheet

    Jai shreeram : దేశంలో మతం విపరీత పోకడలకు పోతోంది. మతం మంచి చేయాలి తప్ప ఉన్మాదానికి దారితీయకూడదు. ఇది ఏ మతానికైనా వర్తిస్తుంది. ప్రజల్లో మంచితనం, సోదరభావం, నిజాయితీ, దాతృత్వం వంటి గుణాలను పెంచేందుకు ఏ మతమైన కృషి చేయాలి కానీ..మత పక్షపాతం ఎన్నడూ పనికిరాదు. ఒక దేశం ఎప్పుడూ లౌకికంగానే ఉండాలి. అంతే తప్ప ఏదో ఒక మతానికి ప్రాధాన్యం ఇస్తే పాకిస్తాన్ లా తయారవుతుంది. భారత్ కు, పాకిస్తాన్ కు ఉన్న తేడా ఇదే. భారత్ లౌకిక దేశంగా అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. పాక్ నానాటికీ అన్ని రంగాల్లో దిగజారిపోతోంది. అన్ని మతాల ప్రజలు అన్నాదమ్ముళ్ల కలిసి పోయి పనిచేస్తేనే ఏ దేశమైన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రస్థానంలోకి దూసుకెళ్తుంది. అయితే భారత్ లో ప్రస్తుతం ఓ రకమైన వ్యత్యాస ధోరణి కనిపిస్తోంది. సమాజం రెండు వర్గాలుగా చీలిపోతున్నట్లు కనిపిస్తోంది.

    అందుకు నిదర్శనంగా ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఘటనను చెప్పుకోవచ్చు. ఇంటర్ పరీక్షల్లో ఆన్సర్ షీట్ లో ‘జైశ్రీరామ్ ’ అని రాసినందుకు కొందరు విద్యార్థులను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేశారు అక్కడి ప్రొఫెసర్లు. యూపీలోని జౌన్ పూర్ లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వంచల్ యూనివర్సిటీ నిర్వహించే ప్లస్ 2 పరీక్షలు ఇటీవలే ముగిశాయి. ఈ పరీక్షలో కొందరు విద్యార్థులు జవాబు పత్రాల్లో జై శ్రీరామ్ ముజే పాస్ కరో అంటూ రాసుకొచ్చారు. అలాగే హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి కొందరు క్రికెటర్ల పేర్లను కూడా జవాబు పత్రాల్లో రాశారు.

    ఆ విద్యార్థులందరూ కూడా 60 శాతం మార్కులతో పాసయ్యారు. పాస్ అవ్వడం కష్టమని భావించే ఆ విద్యార్థులు 60శాతం మార్కులతో పాస్ కావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ దివ్యాంషు సింగ్.. ప్రధాని మోదీ, సీఎం యోగి, గవర్నర్, వీసీలకు లేఖలు రాసి రివాల్యూయేషన్ చేయాలని కోరారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వీసీ వందనా సింగ్ ధ్రువీకరించారు. ఆ విద్యార్థులకు రావాల్సిన మార్కుల కంటే ఎక్కువ వచ్చాయని అన్నారు. దీనికి కారణమైన ప్రొఫెసర్లు డాక్టర్ వినయ్ శర్మ, మనీష్ గుప్తాలను సస్పెండ్ చేశారు.

    Share post:

    More like this
    Related

    Software Engineer Suicide : ఆన్ లైన్ గేమ్.. సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆత్మహత్య

    Software Engineer Suicide : ఆన్ లైన్ గేమ్ లకు ఆలవాటుపడిన...

    Ardhanareeswaram Dance : మైమరిపించిన అర్థనారీశ్వరుడి నాట్యం..

    Ardhanareeswaram Dance : నాట్యం అపురూపం, అనిర్వచనీయం, అద్వితీయం.. ఇలా ఎన్ని...

    AI ఫీచర్లతో ‘పిక్సెల్ 8ఏ’ను లాంచ్ చేసిన గూగుల్.. ధర, ఫీచర్లు ఇవే..

    Google Pixel 8A : గూగుల్ తన లెటెస్ట్ ఏ-సిరీస్ ఫోన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sri Ramanavami : లండన్ లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు..

    Sri Ramanavami : శ్రీరాముడు అందరివాడు. హైందవ సంప్రదాయంలో ఆదర్శ పురుషుడిగా...

    Rama Mandir in Ayodhya : చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కారం.. అయోధ్య లో రామమందిరం నేడు ప్రారంభోత్సవం

    పురాణ నేపథ్యం: మహావిష్ణువు ఏడవ అవతారం అయిన శ్రీరామచంద్రుడికి సంబంధించిన చారిత్రక ప్రాంతం...