32.6 C
India
Saturday, May 18, 2024
More

    Sri Rama Temple : అయోధ్య కంటే 5 రెట్లు పెద్ద శ్రీరామ దేవాలయం. భారత్‌లో ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా?

    Date:

    Sri Rama Temple
    Sri Rama Temple

    Sri Rama Temple : జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఐతే అయోధ్య రామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్ద రామ మందిర నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని కంబోడియాలోనో లేక అమెరికాలోనో కాదు, భారత్‌లో ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసుకుందాం.

    ఈ కొత్త దేవాలయం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం కాబోతోంది. ఆలయ నిర్మాణ ప్రణాళిక ప్రకారం, ఈ ఆలయం 125 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటుంది. దీన్ని 200 ఎకరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆలయ వైశాల్యం 3.67 లక్షల చదరపు అడుగులు. ఈ భారీ రామాయణ దేవాలయం పొడవు 1080 అడుగులు, వెడల్పు 540 అడుగులు.

    ఈ ఆలయంలో 108 అడుగుల ఎత్తులో ఐదు శిఖరాలు ఉంటాయి. ఈ దేవాలయం యొక్క ఎత్తైన శిఖరం 405 అడుగులు ఉంటుంది. అలాగే 180 అడుగుల ఎత్తులో నాలుగు శిఖరాలు ఉంటాయి. ఈ ప్రధాన ఆలయం ముందు, 20,000 మంది సామర్థ్యంతో భారీ ప్రార్థనా మందిరం కూడా ఉంటుంది.
    సమాచారం ప్రకారం, ఆలయం పూర్తిగా నిర్మించిన తర్వాత అయోధ్య నుంచి జనక్‌పూర్ వైపు వెళ్లేటప్పుడు ఈ ఆలయం కనిపిస్తుంది. ప్రస్తుతం దీని నిర్మాణం వేగంగా జరుగుతోంది. 2025 చివరి నెల నాటికి ఆలయం సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు.

    బీహార్‌, తూర్పు చంపారన్‌లోని కైత్వాలియా (కొంతమంది కథ్వాలియా అంటారు)లో ప్రపంచంలోనే అతి పెద్ద రామాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయం అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరామ మందిరం కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. దీని పేరు విరాట్ రామాయణ దేవాలయం. మే 2023లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

    కైత్వాలియా గ్రామంలోని కేసరియా-చైకా రహదారి పక్కన ఈ విరాట్ రామాయణ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రదేశం వైశాలి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో, పాట్నా నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    కంపూచియా లేదా కంబోడియాలోని అంగ్‌కోర్ వాట్ రూపకల్పన ఆధారంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఐతే.. ఈ ఆలయం అంగ్‌కోర్ వాట్ కంటే రెట్టింపు ఎత్తు, పరిమాణం ఉండేలా ప్లాన్ ఉంది. ఈ దేవాలయాల సమూహంలో, మొత్తం 18 దేవతలు, 18 గర్భాలయాలు ఉంటాయి, వీటిలో ప్రధాన దేవత శ్రీరాముడు, స్వామి మధ్య శిఖరం కింద కూర్చుంటారు. అక్కడే ఆయన సహచరులైన సీతాదేవి, లవకుశుల విగ్రహాలను ప్రతిష్టిస్తారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sri Ramanavami : లండన్ లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు..

    Sri Ramanavami : శ్రీరాముడు అందరివాడు. హైందవ సంప్రదాయంలో ఆదర్శ పురుషుడిగా...

    Woman asked Divorce : హనీమూన్ కు గోవా తీసుకెళ్లనందుకు డైవర్స్ కోరిన మహిళ..

    Woman asked Divorce : యుగ ప్రభావమో.. తమను ఎవరూ ఏం...