
Mahavir Ambition : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇది శాంతి, సంతోషం మరియు అందరి విజయాల కోసం కృషి చేయాల్సిన రోజు’ అని బిడెన్ తన తరఫున మరియు ప్రథమ మహిళ జిల్ బిడెన్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
‘మనం ప్రతి ఒక్కరూ మహావీర్ స్వామి మూర్తీ భవించిన విలువలను కొనసాగిద్దాం: సత్యాన్ని వెతకడం, హింస నుంచి బయటపడడం మరియు ఒకరితో ఒకరు సామరస్యంగా జీవించడం’ లాంటివి చేయాలి అని అని ఆయన అన్నారు. జైనమతం 24వ తీర్థంకరుడు మహావీర్ బోధనలు ప్రపంచానికి అవసరమని, ప్రజలను ‘అహింస’ మార్గాన్ని అనుసరించాలని కోరారు.
బైడెన్, జిల్ బైడెన్ వీడియో సోసల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు చెప్పడంతో పాటు మహావీర్ స్వామికి నివాళులర్పించారు. ఆయన చెప్పిన బోధనలను పాటిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని కామెంట్లలో పేర్కొన్నారు.