32.2 C
India
Tuesday, May 21, 2024
More

    Silicon Valley : ‘‘మీది బందరే..మాది బందరే..’’ సిలికాన్ వ్యాలీలో ‘బందరు’ చిన్నోళ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం

    Date:

    Silicon Valley
    Silicon Valley-Bandar Old Students Meet

    Silicon Valley : హ్యాపీ డేస్..హ్యాపీ డేస్..పాఠశాల చదువులు, చిన్ననాటి స్నేహితులు..ఇవే కదా ఒక మనిషికి మరుపురాని మధురక్షణాలు. మనిషి ఎంత ఎదిగినా తల్లిని, పుట్టిన ఊరును, చిన్ననాటి స్నేహితులను మరిచిపోలేం. ఉన్నత చదువులు ఎన్ని చదివినా, పెద్ద పెద్ద హోదాలో ఎంత మంది స్నేహితులు ఉన్నా టెన్త్ లోపు మన స్నేహితులే మనకు బెస్ట్ ఫ్రెండ్స్. వారితో గడిపినా క్షణాలు మనకు మరువలేనివే. చదువుల గోల పూర్తయిన తర్వాత ఉద్యోగరిత్యా నగరాలకు, విదేశాలకు వెళ్లిన మనసు మాత్రం పుట్టిన ఊరుపై, చిన్ననాటి స్నేహితులపైనే ఉంటుంది.

    ఉద్యోగరిత్యా బిజీబిబీగా ఉండి సంవత్సరాల తరబడి సొంతూరు దోస్తులను కలుసుకోలేం. అందుకే కనీసం పూర్వ విద్యార్థుల సమ్మేళనం లాంటి కార్యక్రమాల ద్వారానైనా కలుసుకుంటున్నారు. ఈ ఆత్మీయ వేడుకనే బందరు చిన్నోళ్లు తలపెట్టారు. అయితే ఇది ఇండియాలో కాదండోయ్  సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియాలో.  మే 3వ తేదీన శుక్రవారం సాయంత్రం 6 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రా, 1521 కాలిఫోర్నియా సర్కిల్, మిల్ పిటస్, సీఏ 95035 అనే చోట ‘‘మీది బందరా?’’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బాధ్యులుగా దొరరాజు, మద్దుల గిరీశ్ కుమార్ ఉన్నారు.

    ‘‘బందరులో మీరు ఏ సంవత్సరంలో అయినా చదివి ఉండవచ్చు. ఏ స్కూల్ అయినా కావొచ్చు. ఏ కాలేజ్ అయినా కావొచ్చు. మీరు మీ చిన్ననాటి మిత్రులను కలిసే అపూర్వ అవకాశం ఇది. మీరూ తప్పకుండా రండి.. అలాగే మన బందరు పూర్వ విద్యార్థులందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి’’ అంటూ నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు. సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియాలో స్థిరపడిన బందరు పూర్వ విద్యార్థుల కోసమే ‘మీది బందరా?’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంట్రీ ఫీజు ఏదీ లేదని, కార్యక్రమం తర్వాత పసందు లాంటి విందు భోజనం ఉంటుందని వారు చెప్పారు. మీ సంసిద్ధతను తెలుపడానికి దొరరాజు +91 9000 773399, మద్దుల గిరీశ్ కుమార్ +91 98480 30305 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...