9th November Horoscope : మేష రాశి వారికి ఆర్థికంగా లాభం కలుగులుంది. మానసిక ఆనందం పొందుతారు. అనుకున్నపనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది.
వ్రషభ రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. తొందరపాటు వద్దు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవడం మేలు చేస్తుంది.
మిథున రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. పట్టుదలతో ముందడుగు వేస్తారు. దుర్గాదేవి అష్టోత్తరం చదవడం మంచి ఫలితాలు ఇస్తుంది.
కర్కాటక రాశి వారికి ధైర్యంగా ఉంటారు. ఒక శుభవార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. ఒక విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఇష్టదేవత స్తోత్రం చదువుకోవడం మంచిది.
సింహ రాశి వారికి గొడవలకు దూరంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శనిశ్లోకం చదివితే శుభాలు కలుగుతాయి.
కన్య రాశి వారికి మంచి ఆలోచనతో ముందుకు వెళతారు. ముందుచూపుతో వ్యవహరిస్తారు. పనుల్లో విజయం ఉంటుంది. శివనామస్మరణ మంచి ఫలితాలు ఇస్తుంది.
తుల రాశి వారికి ఒక శుభవార్త మీలో సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక లాభాలుంటాయి. ఆచితూచి వ్యవహరించాలి. లక్ష్మీదేవి దర్శనం మేలు చేస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఉత్సాహంగా ఉంటారు. వాతావరణం బాగుంటుంది. ఇష్టదేవతారాధన చేయడం మంచి జరిగేలా చూస్తుంది.
ధనస్సు రాశి వారికి ఉద్యోగంలో లాభాలున్నాయి. మంచి పనులు చేస్తారు. కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. మహాగణపతి ఆరాధన చేయడం ఉత్తమం.
మకర రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. మొహమాటం పడితే నష్టమే. శ్రీరామనామం జపిస్తే లాభం కలుగుతుంది.
కుంభ రాశి వారికి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. సమయం ప్రకారం ముందుకు సాగితే మంచిది. దుర్గా ఆరాధన మేలు చేస్తుంది.
మీన రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగేలా చేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్యాష్టకం చదవడం ఉత్తమం.