35.8 C
India
Monday, May 20, 2024
More

    Sunrisers : దంచి కొట్టిన సన్ రైజర్స్.. లక్నో చిత్తు

    Date:

    Sunrisers
    Sunrisers

    Sunrisers VS Lucknow : సన్ రైజర్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య ఉప్పల్ లో బుధవారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ సిక్సుల మోత మోగించింది. ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లు మొత్తం  14  సిక్సులు బాది 9.4 ఓవర్లలోనే లక్నో నిర్దేశించిన 165 పరుగులు లక్ష్యాన్ని ఊదేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న లక్నో కు ఏదీ కలిసి రాలేదు. బౌలింగ్ లో కట్టుదిట్టంగా బంతులేసిన సన్ రైజర్స్ బౌలర్లు లక్నో బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టారు.

    డికాక్ రెండు పరుగుల వద్ద భారీ షాట్ కు ప్రయత్నించగా.. డీఫ్ ఫైన్ లెగ్ లో నితీశ్ కుమార్ బౌండరీ లైన్ వద్ద జంప్ చేసి మరీ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.  అయితే 13 పరుగులకే మొదటి వికెట్ కోల్పోగా.. 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది లక్నో. 11.2 ఓవర్లకు 66 పరుగులు నాలుగు వికెట్ల తో ఉండగా.. క్రీజులోకి వచ్చిన  ఆయుశ్ బదోని 30 బంతుల్లోనే 55 పరుగులు, నికోలస్ పూరన్ 26 బంతుల్లో 48 పరుగులతో రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.

    దీంతో లక్నో 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగుల వద్ద ఇన్సింగ్స్ ముగించింది. భువనేశ్వర్ కుమార్ ఎప్పటిలానే గుడ్ లెంగ్త్ డెలవరీస్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

    అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఓపెనర్లు మళ్లీ ఫామ్ అందుకున్నారు. పవర్ ప్లే లోనే 100 పరుగులు దాటించి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరి విధ్వంసం దాటికి స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అభిషేక్ శర్మ ఆరు సిక్సులు, హెడ్ 8 సిక్సులు బాది 9.4 ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసేసింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులు, ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 89 పరుగులు చేశారు. ఇప్పటి వరకు పవర్ ప్లే లో నాలుగు సార్లు 100 పరుగులు దాటితే అందులో రెండు సార్లు సన్ రైజర్స్ ది కావడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    Female Voters : మహరాణుల మద్దతు ఎవరికి దక్కిందో 

    Female Voters : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకోడానికి హోరా, హోరి...

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...