7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. మనోనిబ్బరం ఉండాలి. కీలక విషయాల్లో సలహాలు తీసుకోవడం ఉత్తమం. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
వ్రషభ రాశి వారికి అధికారుల సహకారం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల అభిమానాలు దక్కుతాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిది.
మిథున రాశి వారికి ఎవరితోనూ గొడవలకు దిగొద్దు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. మీ శ్రమ ఫలిస్తుంది. లలితాదేవి ఆరాధన శుభాలు కలిగిస్తుంది.
కర్కాటక రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. అధికారుల అండ ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. ఇష్టదేవతారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
సింహ రాశి వారికి ఒక సంఘటన బాధ అనిపిస్తుంది. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎదుర్కొంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సూర్యుడిని ఆరాధించడం మంచిది.
కన్య రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. ఉద్యోగులకు బాగుంటుంది. భక్తిశ్రద్ధలతో పనులు చేసుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి.
తుల రాశి వారికి ఆర్థికంగా అనుకూలం. ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలి. మీ పట్టుదల ముందుకు నడిపిస్తుంది. విష్ణు ధ్యానం మంచి ఫలితాలు ఇస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి అవసరానికి సాయం చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. విష్ణు సహస్ర నామాలు చదవడం వల్ల మేలు కలిగిస్తుంది.
ధనస్సు రాశి వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు రానివ్వకండి. శ్రీహరి ఆరాధన మంచి చేస్తుంది.
మకర రాశి వారికి ముఖ్య వ్యవహారాల్లో పట్టనట్లుగా ఉండకండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. గోసేవ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు దక్కుతాయి.
కుంభ రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది. ఒక వార్త మీలో సంతోషం కలిగిస్తుంది. అనుకూల ఫలితాలు వస్తాయి. కనకధారాస్తవం చదవడం మంచిది.
మీన రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. కీలక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచితూచి వ్యవహరించడం వల్ల అనుకూలం. ఇష్టదైవాన్ని జపించడం ఉత్తమం.