40.3 C
India
Thursday, May 30, 2024
More

  Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

  Date:

  Actress Childhood Photo
  Actress Anasuya Childhood Photo

  Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ ప్రేక్షకులను ఓ నటి ప్రస్తుతం అలరిస్తోంది. యాంకర్లు ఇలా కూడా డ్రెస్ లు వేసుకుంటారా అనే ట్రెండ్ ను తెలుగులోకి తీసుకొచ్చి సక్సెస్ అయింది. దీంతో ఆమెకు వెల్లువలా ఆఫర్లు వచ్చాయి. ఆమె యాంకరింగ్ కు తెగ ఫ్యాన్స్ అయిపోయారు. అలాంటి ఆమె ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా వెండితెరకు దగ్గరయ్యారు. దీంతో బుల్లితెర ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. వారి బాధను తీర్చడానికి అప్పుడప్పుడు ఆమె ఇన్ స్టాగ్రాంలో ఫొటో లు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆ నటి తన చిన్ననాటి ఫొటోను షేర్ చేసింది దీంతో నెటిజన్లు, ఆమె అభిమానులు తెగ సంబరిపడిపోతున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

  తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అనసూయ. జబర్దస్త్ పేరు చెప్పగానే అనసూయ గుర్తుకు వచ్చేలా చేసింది. తన అందచందాలతో పొట్టి పొట్టి డ్రెసులు వేస్తూ యువకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. జబర్దస్త్ లో స్కిట్ ల పాత్ర ఎంత ఉండేదో తెలియదు కానీ.. ఈమె మాత్రం తను చేసే డ్యాన్స్, పొట్టి డ్రెస్ లతో యువతరానికి దగ్గరైంది. అనంతరం మంచి ఆఫర్లు దక్కించుకుని వెండితెరపై వెలిగిపోతుంది.
  రంగస్థలం సినిమాలో సుకుమార్ ఇచ్చిన పాత్రను సీనియర్ హిరోయిన్ రాశి కాదనడంతో అనసూయ కు లక్కీ ఆఫర్ తగిలింది. కాస్త గ్లామర్ జోడించిన ఈ క్యారెక్టర్ కు రామ్ చరణ్ తో ఇంపార్టెంట్ సీన్లు ఉండటం.. ఎక్స్ పోజింగ్ చేయడంతో పాటు ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.

  ఎంత బిజీగా ఉన్నా ఆమె మాత్రం సోషల్ మీడియా వేదికలపై తన అభిప్రాయాలను, ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రాంలో తాజాగా తన చిన్న నాటి ఫొటో షేర్ చేసింది. ఎంత క్యూట్ గా ఉందో కదా అని చాలా మంది నెటిజన్లు, ఆమె ఫాలోవర్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అవును చిన్న నాటి ఫొటోలు అంటే ఎవరికీ ఇష్టం ఉండదు అని కొందరు అంటుంటే చాలా ముద్దుగా, క్యూట్ గా ఉన్నావ్ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

  అనసూయ రంగస్థలం తర్వాత చాలా సినిమాల్లో నటించింది. యాత్ర లో కీలక రోల్ చేసింది.  విమానం మూవీలో వేశ్య పాత్రలో నటించి విమర్శకులను మెప్పించింది. రజాకార్ సినిమాలో ఆమె నటన గుర్తుండిపోయేలా చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టు గా మూవీస్ లో చాలా కీలక రోల్స్ చేస్తూ దూసుకుపోతుంది. కచ్చితంగా ఆమె క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఒక యాంకర్ గా కష్టపడ్డ అనసూయ ఇంతటీ స్థాయికి రావడం వెనక చాలా త్యాగాలే ఉన్నాయి. ప్రస్తుతం భర్త భరద్వాజ్ ఎంకరేజ్ వల్ల ఆమె సినిమాల్లో దూసుకుపోతుంది.

   

  View this post on Instagram

   

  A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

  Share post:

  More like this
  Related

  Manmohan Singh : మోదీవి విద్వేష ప్రసంగాలు..: మాజీ ప్రధాని మన్మోహన్

  Manmohan Singh : ఎన్నికల ప్రచారంలో విపక్షాలను లేదా ఓ వర్గాన్ని...

  Hyderabad News : కుత్బుల్లాపూర్ లో దారుణం.. క్యాబ్ డ్రైవర్ ను గాయపరిచి దోపిడీ

  Hyderabad News : హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో దారుణం జరిగింది. అర్ధరాత్రి...

  Gold Smuggling : ఏపీలో రెండు చోట్ల బంగారం పట్టివేత

  Gold smuggling : ఏపీలో రెండు వేర్వేరు చోట్ల అక్రమంగా తరలిస్తున్న...

  Uttar Pradesh : మహిళ కడుపులో 2.5 కిలోల వెంట్రుకలు

  Uttar Pradesh : బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కడుపులో నొప్పితో బాధపడుతున్న...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Anchor Anasuya : అనసూయ బర్త్ డే సందర్భంగా సుశాంక్ ఏం పోస్ట్ చేశాడంటే?

  Anchor Anasuya : నటిగా మారిన యాంకర్ అనసూయ భరద్వాజ్ సౌత్...

  Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

  Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

  Anasuya Campaign : పవన్ కళ్యాణ్ కు మద్దతు గా అనసూయ ప్రచారం..? 

  Anasuya Campaign : సమాజంపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నటి...

  Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

  Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...