Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం లేదు. అందం, మాటలతో మెస్మరైజింగ్ చేస్తూ స్మాల్ స్ర్కీన్ ను ఒక దశలో ఏలింది. సొగసరి అయిన ఆమెను చూసేందుకే చాలా మంది జబర్ధస్త్ షో చూస్తారంటే అతిశయోక్తి కాదు. అంతలా బుల్లి తెరపై ముద్ర వేసింది.
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్న ఆమె మంచి మంచి పాత్రల్లో కనిపించి తన నటనతో మెప్పిస్తోంది. దర్శకుడు సుకుమార్ ఆయన సినిమాలో ఆమె పాత్రకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. రంగ స్థలంలో రంగమ్మత్తగా, పుష్పలో శ్రీను భార్యగా ఎక్కువ నిడివి కనిపించే పాత్రలు ఇచ్చాడు. ఆమె కూడా ఈ పాత్రల్లో అలవోకగా పరకాయ ప్రవేశం చేస్తోంది.
గతంలో కొన్ని వివాదాల్లో మునిగి తేలిన ఆమె, ఈ మధ్యే బయటపడింది. రౌడీ బాయ్ దేవరకొండ విజయ్ సినిమా అర్జున్ రెడ్డి నుంచి వీరిద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. దేవరకొండ ఫ్యాన్స్ కూడా అనసూయను బాగానే ఇబ్బంది పెట్టారు. కానీ ఇటీవల ఈ వివాదాలకు ఆమె స్వస్తి తెలిపింది. సామరస్యంగా ఉంటామని ట్విటర్, ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే..
సంప్రదాయ దుస్తుల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దిట్ట అనసూయ భరద్వాజ్ మరోసారి అదరగొట్టింది. ఈసారి ఆమె సాధారణ నగలను పక్కనపెట్టి అదిరిపోయే గ్రీన్ ఎంబ్రాయిడరీ లెహంగాలో మినిమలిస్ట్ లుక్ లో దర్శనమిచ్చింది. లో-నెక్ బ్లౌజ్ సొగసు యొక్క స్పర్శను జోడిస్తుంది, అయితే ఎత్తైన పోనీటైల్ వస్తువులను తాజాగా మరియు ఆధునికంగా ఉంచుతుంది.
పచ్చదనం మధ్య నడుస్తూ, లెహంగా యొక్క శక్తివంతమైన ఆకుపచ్చ సహజ నేపథ్యాన్ని భర్తీ చేస్తుంది, ఆకర్షణీయమైన దృశ్య సామరస్యాన్ని సృష్టిస్తుంది. సున్నితమైన మేకప్, పింక్ లిప్ స్టిక్ టచ్ తో ట్రెడిషనల్ బ్యూటీ సింపుల్ గా, అదిరిపోయేలా ఉంటుందని నిరూపిస్తోంది అనసూయ.