31.8 C
India
Sunday, May 12, 2024
More

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Date:

    Cyber Scam
    Cyber Scam

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా సైబర్ కేటుగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా సీబీఐ పేరుతో ఓ రిటైర్డు ఉద్యోగిని మోసం చేసి రూ. 35 లక్షలు కొట్టేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయ వెలుగులోకి వచ్చింది. ఓ రోజు రిటైర్డు ఉద్యోగి (65)కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నంబర్ పై అక్రమ ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఐపీసీ 67ఏ, 354ఏ, 499, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు హెచ్చరించారు. అయితే తనకు దొంగ ప్రకటనలకు ఎలాంటి సంబంధం లేదని వృద్ధుడు వారికి వివరించగా అతను ఫోన్ కట్ చేశాడు.

    అనంతరం మూడు రోజుల తర్వాత అదే వృద్ధుడికి నకిలీ సీబీఐ ప్రొఫైల్ నుంచి స్కైప్ వీడియో కాలు వచ్చింది. అతనిపై సీబీఐ కేసు నమోదు చేసిందని, కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. అది నిజంగానే నమ్మిన బాధితుడు వారు అడిగిన వివరాలను చెప్పేశాడు. బ్యాంక్ వివరాలు అడిగారు. విచారణ పూర్తయ్యేంత వరకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్ల్ోనే ఉండాలని కేటుగాళ్లు హెచ్చరించారు. మరుసటి రోజు బాధితుడిని రూ. 34 లక్షలు డిపాజిట్ గా బదిలీ చేయాలని, విచారణ పూర్తయిన తర్వాత డబ్బు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. దీంతో బాధితుడు డబ్బు పంపాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బు కావాలని ఒత్తిడి చేయడంతో నగలు అమ్మి ఇచ్చాడు. చివరికి ఇది మోసం అని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు.

    Share post:

    More like this
    Related

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Cyber Scam : ఒక ఫోన్ కాల్ తో 30 లక్షలు పోగొట్టుకున్న పిహెచ్ డీ స్కాలర్..

    Cyber Scam : కొత్త తరహా నేరాలతో సైబర్ కేటుగాళ్లు విజృంభి...

    Global Threats : ఈ ఏడాది ప్రపంచం ఎదుర్కొనే ముప్పులు ఏమిటో తెలుసా?

    Global Threats : ప్రపంచం ప్రతి ఏటా కొన్ని ఆపదలను ఎదుర్కొంటుంది....

    Opposite Gender Calls : ఆపోజిట్ జెండర్ కాల్స్ తో జాగ్రత్త.. ఏం జరుగుతుందంటే?

    Opposite Gender Calls : శక్తి ఒక రూపం నుంచి మరొక...

    Cyber Crimes : వలపు వల, చిక్కితే గిలగిల..

    Cyber Crimes : సోషల్ మీడియా వాడకం ఎక్కువ కావడంతో సైబర్‌ నేరాలకు...