35.9 C
India
Saturday, May 11, 2024
More

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    Date:

    GT Vs RCB
    GT Vs RCB

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 కు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు ప్లే ఆప్ రేసులో ఉంటారు. ఇప్పటికే ఆర్సీబీ 9 మ్యాచ్ లు ఆడి కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. గుజరాత్ తొమ్మిదింట్లో నాలుగు మాత్రమే గెలిచి ఏడో స్థానంలో ఉంది. దీంతో ఇరు జట్లు గెలుపు కోసం శ్రమించాల్సి ఉంది.

    గుజరాత్ బ్యాటర్లలో శుభమన్ గిల్ తన పూర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడు. స్పిన్నర్లు రషీద్ ఖాన్, నూర్ బాగానే బౌలింగ్ చేస్తున్న పేస్ బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. గత మ్యాచ్ లో మోహిత్ శర్మ ఏకంగా నాలుగు ఓవర్లలోనే 71 పరుగులు ఇచ్చి జట్టు ఓటమికి కారణమయ్యాడు.

    ఆర్సీబీకి ఆరు ఓటముల తర్వాత ఒక విజయంతో కాస్త బలం చేకూరింది. సన్ రైజర్స్ ను సొంత స్టేడియంలో ఓడించడం వల్ల పాజిటివ్ ఎనర్జీని సొంతం చేసుకుంది. బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ గెలుపు సులభమైంది. ఆర్సీబీ బ్యాటర్లలో విల్ జాక్స్, విరాట్, డుప్లెసిస్ రాణిస్తే భారీ స్కోరు కావడం ఖాయం. దినేశ్ కార్తీక్ చివర్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. రజిత్ పటిదార్ ఫామ్ లోకి రావడం కలిసొచ్చే విషయమే అయినా భారీ స్కోరు చేయలేక వెనుదిరుగుతున్నాడు.

    ఆర్సీబీ టీం ప్లే ఆప్ చేరాలంటే చివరి అయిదు మ్యాచుల్లో తప్పక భారీ తేడాతో గెలవాలి. అదే సమయంలో వేరే జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా మారాలి. గుజరాత్ టైటాన్స్ మొదటి సీజన్ లోనే టైటిల్ గెలిచి విజయం సాధించింది. గతేడాది రన్నరప్ గా నిలవడం, కెప్టెన్ గా ఉన్న హర్దిక్ పాండ్యా ముంబయికి తరలిపోవడంతో బలహీనంగా మారింది. ఆర్సీబీతో పోరులో గుజరాత్ ఫేవరేటే అయినా తిరిగి ఫామ్ లోకి వచ్చిన ఆర్సీబీని గుజరాత్ ఓడించడం అంతా సులువేం కాదు.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్ పరువు నిలబెట్టుకునేనా..

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ 2024లో ఎలిమినేట్ అయిన...

    Hardik Pandya : హర్ధిక్ తీరు బాగోలేదు..

    Hardik Pandya : ముంబయి ఇండియన్స్ టీం అయిదు సార్లు ఐపీఎల్...

    IPL 2024 : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

    IPL 2024 : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు...

    Sunrisers : దంచి కొట్టిన సన్ రైజర్స్.. లక్నో చిత్తు

    Sunrisers VS Lucknow : సన్ రైజర్స్, లక్నో సూపర్ గెయింట్స్...