34 C
India
Tuesday, May 21, 2024
More

    Hardik Pandya : హర్ధిక్ తీరు బాగోలేదు..

    Date:

    Hardik Pandya
    Hardik Pandya

    Hardik Pandya : ముంబయి ఇండియన్స్ టీం అయిదు సార్లు ఐపీఎల్ కప్ గెలిచి స్ట్రాంగ్ టీంగా నిలిచింది. ఇందులో అయిదు సార్లు కూడా రోహిత్ శర్మనే కెప్టెన్ గా ఉన్నాడు. రోహిత్ ను కాదని హర్ధిక్ పాండ్యాను ముంబయి జట్టు కెప్టెన్ గా చేసింది. దీన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. అదే తీరులో కూడా ముంబయి ఇండియన్స్ ఆట సాగుతోంది. ఇప్పటికే 12 మ్యాచులు ఆడిన ముంబయి 4 మాత్రమే గెలిచి టోర్నీ నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయిన జట్టుగా పరువు పోగొట్టుకుంది.

    హర్ధిక్ పాండ్యా కంటే టీంలో సీనియర్లు ఉన్నారు. వారికి హర్దిక్ రెస్పెక్ట్ ఇవ్వడం లేదనే విషయం గ్రౌండ్ లోనే చూస్తే అర్థమవుతుంది. రోహిత్ శర్మను థర్డ్ మ్యాన్ లోకి ఫీల్డింగ్ కు పంపడం నుంచి.. గ్రౌండ్ లో అతడి ఆటిట్యూడ్ ఎవరికీ నచ్చడం లేదు. హర్దిక్ పాండ్యా అచ్చం డ్రెస్సింగ్ రూంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాడని దీనిపై ఒక్కొక్కరితో టీం మేనేజ్ మెంట్ మాట్లాడినట్లు తెలుస్తోంది.

    అసలు హర్దిక్ కెప్టెన్సీలో చేయడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటీ? అసలు సమస్య ఎక్కడ వస్తుందని అడిగింది. హర్దిక్ కూడా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ తిలక్ వర్మపై నేరుగానే విమర్శలు చేశాడు. లెఫ్ట్ హ్యండ్ బ్యాటర్ తిలక్ కు లెఫ్ట్ హ్యండ్ బౌలర్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తుంటే సరిగా ఆడలేకపోయాడని అందుకే మ్యాచ్ ఓడిపోయామని అన్నాడు. దీంతో హర్దిక్ పై ట్రోల్స్ మరింత పెరిగాయి.

    ఢిల్లీతో మ్యాచ్ లో తిలక్ వర్మనే టాప్ స్కోరర్ కాగా.. అతడిపైనే నిందలు వేయడం సరైంది కాదని పలువురు మాజీ క్రికెెటర్లు పాండ్యా తీరును తప్పుబట్టారు.  హర్దిక్ పాండ్యాకు కాస్త తలపొగరు వచ్చినట్లు కనిపిస్తుందని తాజాగా ఏబీ డివిలియర్స్ కామెంట్స్ చేశారు. దీంతో హర్దిక్ పై ముప్పేట విమర్శల దాడి పెరుగుతోంది. ముంబయి కెప్టెన్సీ ఏమో గానీ అతడి ఆటిట్యూట్ నచ్చక అందరితో  చెడ్డవాడని పేరు తెచ్చుకుంటున్నాడు. ఒక ఇండియా టీంకు ఆడే వ్యక్తిపై ఇలాంటి కామెంట్లు రావడం నిజంగా బాధాకరమే.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...