Anchor Anasuya : బుల్లితెర యాంకర్ గా అనసూయ భరద్వాజ్ ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా జబర్ధస్త్ కామెడీ షోతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. గ్లామరస్ లుక్స్‌లో అలరిస్తూ యాంకరింగ్‌తో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్‌ను మెప్పించింది. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. ఆ తర్వాత వివిధ షోలతో తన టాలెంట్ నిరూపించుకుంది.
వరుస సినిమాల అవకాశాలు వస్తుండడంతో అనూహ్యంగా బుల్లితెరకు గుడ్ బై చెప్పింది. చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. నటిగా తనలోని ప్రతిభను చాటుకుంది. సోషల్ మీడియాలో ట్రెండీగా మారుతుంది. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ షేర్ చేస్తూ తనదైన శైలిలో క్యాప్షన్ ఇస్తుంది. తన ఫాలోవర్స్ కు కనుల వింధు చేస్తూనే ఉంటుంది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు మాల్స్ ఓపెనింగ్స్ కు సైతం వెళ్తుంటుంది. రీసెంట్ గా విజయనగరంలో తళుక్కున మెరిసింది. సిటీలోని శృంగవరపు కోట ఏరియాలో పెట్టిన సిల్క్ స్టోర్ ను ప్రారంభించింది. ఆ సమయంలో ఈ బ్యూటీ.. ట్రాన్స్ పరెంట్ శారీలో మెరిసింది. చీరకట్టులో ఆమెను చూసిన పురుషులు ఆనందం వ్యక్తం చేస్తుంటే మహిళలు మాత్రం కుళ్లుకుంటున్నారట. ఇక ప్రారంభోత్సవంలో స్టోర్ ను ప్రమోట్ చేస్తూనే.. ఫ్యాన్స్ తో సరదాగా ముచ్చటించింది.
అనసూయ ప్రారంభిస్తుందని స్టోర్ యాజమాన్యం బాగా ప్రచారం చేసింది. దీంతో ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అనసూయను చూసి సందడి చేశారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. వీటికి సంబంధించిన పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
యాంకర్ కు ఇంత భారీ క్రేజ్ ఉండడం గ్రేటనే చెప్పాలి. రంగమ్మత్త క్రేజ్ అలా ఉంది మరి.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే అనసూయ నటిస్తున్న రజాకార్ మూవీ మార్చి 15న రిలీజ్ కానుంది. ఐకాన్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మూవీ పుష్ప2 ఆగస్ట్ 15న విడుదలవ్వనుంది.