35.9 C
India
Sunday, May 12, 2024
More

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Date:

    Indian Film Industry
    Indian Film Industry

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు సినిమాలను శుక్రవారం రిలీజ్ చేస్తారు మేకర్స్. కానీ ఈ రోజుల్లో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను మాత్రం వీకెండ్ కు ఒక రోజు ముందు అదనపు ప్రయోజనం పొందేందుకు గురువారం విడుదల చేయడాన్ని మనం చూస్తున్నాం. మరి కొన్ని నెలల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న పలు చిత్రాలు కూడా చాలా వరకు గురువారమే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.

    సౌత్ ఇండియాలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. జూన్ 17వ తేదీ (సోమవారం) బక్రీద్ సెలవును సద్వినియోగం చేసుకుంటూ జూన్ 13వ తేదీ (గురువారం) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రభాస్ తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ కానీ, హాలిడే అడ్వాంటేజ్ కానీ ఏమీ లేవు.

    అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ ఆగస్ట్ 15 (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ ను సద్వినియోగం చేసుకుంటుంది. పుష్ప 2 తర్వాత రెండు వారాల తర్వాత నాని నటించిన ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ సినిమాకు కూడా హాలిడే, లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఏమీ లేదు.

    ఎన్టీఆర్ ‘దేవర’ కూడా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. కొన్ని సినిమాలు వీకెండ్స్ ను క్యాష్ చేసుకోగా, మరికొన్ని హాలిడే షెడ్యూల్స్ తో సంబంధం లేకుండా గురువారాల్లో విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ ధోరణి త్వరలోనే భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ఆనవాయితీగా మారే అవకాశం కనిపిస్తోంది.

    Share post:

    More like this
    Related

    May 12 Speciality : చరిత్రలో ఈ రోజు.. ఈ రోజుకు విశిష్టతలెన్నో..

    May 12 Speciality : ‘గత చరిత్ర భవిష్యత్ తరాలకు బాట’...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Money Seized : మినీవ్యాన్ బోల్తా.. బయటపడ్డ కరెన్సీ కట్టలు

    Money Seized : విజయవాడ-విశాఖపట్నం నేషనల్ హైవేపై ఓ మినీవ్యాన్ బోల్తా...

    Kolkata Knight Riders : కోల్ కతా గ్రాండ్ విక్టరీ.. ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ

    Kolkata Knight Riders : కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Kalki Release : కల్కి రిలీజ్ వాయిదా.. ఎప్పుడు విడుదలంటే?

    Kalki Release : కల్కి రిలీజ్ డేట్ మారిందా..  ప్రభాస్ అభిమానులకు...

    India Costly Film : ఇండియాస్ కాస్ట్లీ ఫిల్మ్: టాప్ క్వాలిటీ, కానీ పెనెట్రేషన్..?

    India Costly Film : రెబల్ స్టార్ ప్రభాస్ - సెన్సేషనల్...