Home POLITICS ANDHRA PRADESH Andhra Politics : ఏపీలో వేడెక్కిన రాజకీయం

Andhra Politics : ఏపీలో వేడెక్కిన రాజకీయం

7
Andhra Politics
Andhra Politics

Andhra Politics : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వెడ్డెకింది. తెలుగు దేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ లు కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి తరుపున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వీరితో పాటు అప్పుడప్పుడు బీజేపీ అగ్రనేతలు ఢిల్లీ నుంచి వచ్చి వెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం షర్మిల భారం మోస్తోంది. వైసీపీ రెండో సారి అధికారం తనదేనని ధీమాలో జగన్ మోహన్ రెడ్డి దీంతో ఉన్నారు. అన్నీ తాను బరువు, భాద్యతలు  ఎత్తుకున్నారు.

జనంలో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్  వైసీపీ అధినేత జగన్ పై చేస్తున్న ప్రసంగాలు మాత్రం తీవ్రంగానే ఉన్నాయి. జగన్ కూడా అదే స్థాయిలో ఆ ఇద్దరిపై విరుచుకుపడుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అనే  భేదం చూడకుండా ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. అధికారం దక్కించుకోడానికి జనంలో నోటికి ఏ మాట వస్తే ఆ మాటే మాట్లాడుతున్నారు. రెండు పార్టీల నాయకుల మాటలు తూటాలై పేలుతున్నాయి. హద్దులు దాటి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బాహాటంగానే ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. వ్యక్తిగతముగ  ఆరోపణలు,విమర్శలకు దిగుతున్నారు. అనుచిత వ్యాఖ్యలను వదలడంలేదు. ఒక విదంగా చెప్పాలంటే ఎన్నికల నిబంధనలను పాటించకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు.

వైసీపీ అధినేత,సీఎం జగన్ మోహన్ రెడ్డి తోపాటు, రాష్ట్ర మంత్రి రామచంద్ర రెడ్డి పై టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు, జనసేన అధినేత పవన కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడారంటూ  వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్ కు  రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఏ మాత్రం పాటించడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కోర్ట్ పరిధిలో ఉన్న వై ఎస్ వివేకా హత్య కేసును ప్రచారంలో వాడుకొని  తెలుగు దేశం, జనసేన పార్టీలు లబ్ది పొందాలని చూస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్ ఫిర్యాదుల నేపథ్యంలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలపై కమిషన్ నిఘా పెట్టింది.