31.9 C
India
Friday, May 17, 2024
More

    Virat Kohli’ : విరాట్ కోహ్లి ఎంట్రీకి నేటితో 15 ఏళ్లు

    Date:

    Virat Kohli'
    Virat Kohli’
    Virat Kohli’ : టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి 15 ఏళ్ల పూర్తయింది. ఈ కాలంలో ఎన్నో రికార్డులు సాధించాడు. తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించి పరుగుల వరద పారిండంలో కోహ్లికి మంచి పేరుంది. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో విరాట్ గంభీర్ తో కలిసి బ్యాటింగ్ చేశాడు. క్రికెట్ ప్రయాణంలో ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.

    అండర్ 19 కెప్టెన్ గా 2008లో దేశానికి వరల్డ్ కప్ అందించిన కోహ్లి కొన్నాళ్లకే జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడమే అతడికి తెలిసిన విద్య. గౌతమ్ గంభీర్ తో కలిసి ఓపెనింగ్ చేసిన కోహ్లి 12 పరుగులు మాత్రమే చేశాడు. అలా తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించిన కోహ్లి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు.

    ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 275 వన్డేలు, 111 టెస్టులు, 115 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 8676, వన్డేల్లో 12,898, టీ20ల్లో 4008 పరుగులు చేశాడు. అత్యధికంగా వన్డేల్లో 46 శతకాలు చేయడం గమనార్హం. టెస్టుల్లో 26, టీ20ల్లో ఒక అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత అతడి సొంతం.

    టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసింది కోహ్లి. ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా గుర్తింపు. వన్డేల్లో అత్యధిక సంఖ్యలో క్యాచ్ లు (142) పట్టిన రికార్డు అతడి సొంతం. విరాట్ కోహ్లి పదిహేనేళ్ల కాలంలో చాలా రికార్డులు బద్దలు కొట్టాడు. క్రికెటర్లకు ఆదర్శప్రాయంగా నిలిచి ఎందరికో ఆదర్శంగా మారాడు.

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Virat Dancing : డీజే టిల్లు పాటకు విరాట్ డ్యాన్స్.. ఫ్యాన్స్ కేరింతలు

    Virat dancing : డీజే టిల్లు తెలుగు సినిమాల్లో ఒక సంచలనం....

    Virat Kohli : అసహనం..ఆవేశం అంతలోనే ధీర్ఘాలోచన..

    Virat Kohli : ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుస పరాజయాలతో  రాయల్...

    T20 World Cup : టీ-20 వరల్డ్ కప్ జట్టు ఇదేనా? పంత్ రీఎంట్రీ..రోహితే కెప్టెన్..

    T20 World Cup : వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి...