33.2 C
India
Monday, February 26, 2024
More

  T20 World Cup : టీ-20 వరల్డ్ కప్ జట్టు ఇదేనా? పంత్ రీఎంట్రీ..రోహితే కెప్టెన్..

  Date:

  T20 World Cup Team
  T20 World Cup Team

  T20 World Cup : వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాధ నుంచి టీమిండియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇండియాలోనే ఆసీస్ జట్టుపై టీ-20 సిరీస్ గెలువడం, ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో ఆడిన టెస్టు సిరీస్ ను సమం చేయడం..ఇలా ఒక్కొక్క సిరీస్ తో మళ్లీ గాడినపడుతోంది. వీటన్నంటి కంటే ప్రధానమైనది టీ-20వరల్డ్ కప్.. దీన్ని గెలిచి అభిమానులకు గిఫ్ట్ గా ఇవ్వాలని ప్రతీ భారత ఆటగాడు కోరుకుంటాడు. అందుకే ఇప్పటి నుంచే ఆ సమరం కోసం సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి.

  వెస్టిండీస్, యూఎస్ వేదికగా జూన్ 1 నుంచి టీ-20 ప్రపంచ కప్  ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ శుక్రవారమే విడుదల చేసింది. మొత్తం ఐదు వేదికల్లో టోర్నీ జరుగనుంది. 20 జట్టు పాల్గొనే ఈ టోర్నీలో మొత్తం ఐదేసి జట్లతో 4 గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూపు-ఏలో ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో జూన్ 1న అమెరికా, కెనడా జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగనుంది. టీమిండియా-ఐర్లాండ్ మ్యాచ్ జూన్ 5న, పాక్ తో మ్యాచ్ 9న జరగనుంది.

  ప్రపంచకప్ కు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. కానీ ప్రపంచకప్ లో ఆడబోయే జట్టుపై ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి.  జట్టులో ఎవరెవరినీ ఎంపిక చేస్తారు అనే విషయాలపై డిస్కషన్స్ జరుగుతున్నాయి.

  కాగా 2022లో జరిగిన టీ-20 ప్రపంచకప్ లో ఆడిన రోహిత్ శర్మ మళ్లీ ఇప్పటివరకూ ఒక్కా  టీ-20 మ్యాచ్ ఆడలేదు. అయితే రాబోయే ప్రపంచకప్ ను ఆయన ఆడనున్నారు. అతడే కెప్టెన్ గా ఉండనున్నారు. విరాట్ కోహ్లి కూడా ఆడుతారని వార్తలు వినిపిస్తున్నాయి. వన్ డౌన్ లో వస్తాడని కూడా అంటున్నారు.

  ఇక ఏడాది కింద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ కూడా ఈ టోర్నీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంతకుముందే జరిగే  ఐపీఎల్ నుంచే అతడు మైదానంలో అడుగుపెడుతాడని అంటున్నారు.

  రాబోయే టీ-20 ప్రపంచకప్ లో ఆడే భారత జట్టు ఇలా ఉండొచ్చని తెలుస్తోంది. రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, పాండ్యా, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, రవి బిష్ణోయ్, సిరాజ్, బుమ్రా, అర్షదీప్ సింగ్.

  Share post:

  More like this
  Related

  Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

  Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

  Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

  Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

  India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

  India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

  Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

  Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

  Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

  White Ball Specialist : వైట్ బాల్ స్పెషలిస్ట్ గా బూమ్రా.. కానీ, ఆ రోజు అలా.. : రవిశాస్త్రి

  White Ball Specialist : ఇంటర్నేషనల్ క్రికెట్ కైన్సిల్ (ఐసీసీ) ఇటీవల...

  U-19 World Cup 2024 : కప్ తో పాటు వారి ప్రేమను కూడా గెలిచారు

  U-19 World Cup 2024 : వన్డే వరల్డ్ కప్ మనకు...

  Team India : టీమిండియా నిర్ణయంతో విమర్శల వెల్లువ

  Team India : టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఏడు టెస్టుల సిరీస్...