sarayu ఇండస్ట్రీలో హీరోలకు ఫ్యాన్స్ ఉండడం సహజమే.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు అయితే వేరే లెవల్లో హీరోలను ఫాలో అవుతుంటారు. వారు అంటే అభిమానం బాగా పెంచుకుంటారు.. ఇక ఈ అభిమానం ఎలా ఉంటుంది అంటే వారి కోసం ఏమైనా చేసేలా ఉంటారు.. కొంత మంది అమ్మాయిలు తమ అభిమాన హీరోలపై క్రష్ ఏ లెవల్లో ఉందో ఓపెన్ గానే చెబుతుంటారు.
మరి తాజాగా మరో భామ ఆమెకు ఎవరు అంటే క్రష్ ఉందో చెప్పేసి అందరికి షాక్ ఇచ్చింది.. ఆ భామ ఎవరంటే బిగ్ బాస్ తో ఫేమస్ అయిన సరయు.. ఈ భామ బిగ్ బాస్ కంటే ముందే పరిచయం ఉన్న అంతగా ఫేమస్ అవ్వలేదు.. కానీ బిగ్ బాస్ లో ఎన్నో రోజులు లేకపోయినా బాగా ఫేమస్ అయ్యి పాపులర్ అయ్యింది.
ఇక యూట్యూబ్ లో ఈమె అడల్ట్ వీడియోస్ చేస్తూ ఫేమస్ అయ్యింది.. బూతులు మాట్లాడుతూ ఈమె బాగా క్రేజ్ పెంచుకుంది.. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చాక ఈమెకు సినిమాల్లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి.. దీంతో ఈ భామ బిజీ బిజీగా మారిపోయింది.. ఇది పక్కన పెడితే ఈమె తాజాగా స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
తాను రామ్ చరణ్ కు పెద్ద అభిమానిని అని ఆయనకు పెళ్లి అయ్యింది అని తెలిసినప్పుడు చాలా బాధ పడ్డానని.. రామ్ చరణ్ లాంటి భర్త రావాలని కోరుకున్నాను అని ఆయనతో ఒక్కరోజు డేటింగ్ ఛాన్స్ వచ్చిన రెడీ అంటూ ఈమె సరదాగా కామెంట్స్ చేసింది. అయితే ఈ కామెంట్స్ విన్న వారు రామ్ చరణ్ కు ఇలాంటి అభిమానులు కామనే అంటుంటే మరికొంత మంది అంత సీన్ నీకు లేదులే అంటున్నారు.