Bigg Boss sarayu తెలుగులో ఫేమస్ అయిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికే 6 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. అయితే 6వ సీజన్ అట్టర్ ప్లాప్ అవ్వడంతో కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు 7వ సీజన్ ను స్టార్ట్ చేసారు.. ఇది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని బిగ్ బాస్ లవర్స్ ఎదురు చూస్తున్నారు..
మరి ఎట్టకేలకు మరికొద్ది రోజుల్లోనే ఈ రియాలిటీ షో స్టార్ట్ కానుంది.. బిగ్ బాస్ ప్రోమో రావడంతో అతి త్వరలోనే 7వ సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో బిగ్ బాస్ లవర్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హోస్ట్ గా నాగార్జున అయితే ఫిక్స్ అయ్యాడు.
మరి త్వరలో స్టార్ట్ కాబోతున్న ఈ సీజన్ లో ఎవరెవరు పాల్గొంటారు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో బాగా పెరిగింది.. ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి కంటెస్టెంట్స్ రాబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ షో అంటే ఇష్టపడే వారు ఎంత మంది ఉన్నారో ఆరోపణలు చేసే వారు కూడా అంత మంది ఉన్నారు..
ఈ షోపై చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న సరయు సంచలన నిజాలు బయట పెట్టింది.. ఈ షో అంతా అబద్ధం అని కొంత మంది డబ్బులు ఇచ్చి మరీ ఈ షోకి వస్తారని.. షో యాజమాన్యం కొంత మందిని కావాలని ప్రమోట్ చేస్తారని అవి చూసి నిజమని నమ్మే మనం పిచ్చోళ్ళం అని ఇలాంటి షోలు చూడకండి అంటూ ఈమె చెప్పింది. ఎందుకంటే నేను ఈ షోకి వెళ్లానని అక్కడ ఏం జరుగుతున్నాయో నాకు తెలుసు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..