Bigg Boss-7 బిగ్ బాస్ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం.. ఎందుకంటే ఇప్పటికే 6 సీజన్స్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు 7వ సీజన్ కోసం రెడీ అవుతుంది.. 6వ సీజన్ అట్టర్ ప్లాప్ అయిన నేపథ్యంలో 7వ సీజన్ ను గ్రాండ్ గా హిట్ చేయాలని స్టార్ మా టీమ్ ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది..
ఇక ఎన్నో రోజులుగా బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 7 అప్డేట్ అయితే వచ్చేసింది.. ఈ సీజన్ ప్రోమోను ఎటువంటి హంగామా లేకుండా రిలీజ్ చేసారు.. ఎప్పటి లాగానే ఈ ప్రోమోను కేవలం లోగోతో రిలీజ్ చేసారు.. సెప్టెంబర్ 2న ఆదివారం బిగ్ బాస్ షో స్టార్ట్ కావాల్సి ఉండగా ఇప్పటి నుండే ప్రమోషన్స్ లా ప్రోమోను అయితే వదిలారు.
ఇప్పటికే ఈ సీజన్ సెట్ వర్క్ పూర్తి అయ్యింది.. అనుకున్న సమయం కంటే ముందుగానే పనులు పూర్తి అవ్వడంతో సీజన్ 7 ముందుగానే స్టార్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది.. ఇక ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జుననే వ్యవహరించ నున్నారు. ఇదిలా ఉండగా కంటెస్టెంట్స్ గురించి కూడా పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి..
సీజన్ 6లో కంటెస్టెంట్స్ కారణంగానే అట్టర్ ప్లాప్ అయ్యింది.. దీంతో ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ మీద ద్రుష్టి పెట్టి ఎంపిక చేసినట్టు సమాచారం.. ఇప్పటికే పలువురు పేర్లు బయటకు వచ్చాయి. వీళ్ళలో ఎవరు చివరికి ఉంటారో తెలియదు. సీజన్ 6లో జరిగిన తప్పులు మరోసారి రిపీట్ అవ్వకుండా గట్టి బందోబస్తుగా స్టార్ట్ చేయనున్నారు.. చూడాలి ఈసారి ఈ రియాలిటీ షోతో ఎంత అలరించనున్నారో..