34.1 C
India
Monday, April 29, 2024
More

    Nagarjuna : నాగ్.. చింతకాయ స్టోరీలు ఇంకెన్ని రోజులు?

    Date:

    Nagarjuna
    Nagarjuna Naa Samiranga

    Nagarjuna : సినిమా అంటే కథలో కొత్తదనం ఉండాలి..ఎవరూ ఊహించని ట్విస్ట్ లు ఉండాలి..ఆడియన్స్ ను కొత్తలోకంలోకి తీసుకెళ్లాలి. థియేటర్ బయటకు వచ్చినా సినిమాలోని ఎమోషన్ గుండెలను తడుతూ ఉండాలి.. అలాంటి కథలే కొన్నేండ్ల పాటు గుర్తుండిపోతాయి. ఏదో హిట్ వస్తే చాలు అనుకుని ఆరు మాస్ పాటలు, మూడు ఫైట్లు, కొద్దిగా కామెడీ ట్రాక్.. వండివారిస్తే చాలు హిట్ అయిపోద్ది అనుకుంటే ఎలా?. అలాంటి సినిమాలు ఏదో ఎంటర్ టైన్ చేస్తాయి. పెట్టిన పెట్టుబడి వస్తుంది తప్పా..ఆ సినిమా ఎవరికైనా పదికాలాల పాటు గుర్తుంటుందా?

    కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’ మూవీ చూస్తే అలానే అనిపిస్తుంది. సినిమాకు హిట్ టాక్ వచ్చినా..కథలో కొత్తదనం ఏమీ లేదు. ఇలాంటి స్టోరీలు ఇప్పటికీ వేలల్లో వచ్చాయనే చెప్పాలి. భారీగా జుట్టు పెంచుకుని వేట కొడవళ్లు చేతిలో పట్టుకుని ఎలివేషన్ ఇస్తూ, దాన్ని చూపిస్తూ కొంచెం కామెడీని, కొద్దిగా లవ్ ట్రాక్… జనాలను ఎంటర్ టైన్ చేసే ప్రయత్నమే ఇది తప్పా..వేరే ఏం కాదు.

    ఈ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ .. మూస సినిమాలు కాబట్టే ‘హనుమాన్’ వంటి చిన్న సినిమా ఈసారి సంక్రాంతి విజేతగా నిలిచింది. సినిమా కథలో కొత్తదనం, అద్భుతమైన స్క్రీన్ ప్లే, ఎలివేషన్స్.. అన్నీ కుదిరాయి కాబట్టి సినిమా టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. ఇక మన సీనియర్ హీరోలు ఇంకా రొట్టకొట్టుడు కథలనే నమ్ముకోవడం.. దురదృష్టకరం.

    కొత్త హీరోలు సైతం సినిమా సినిమాకు వైవిధ్యం చూపించాలని తహతహలాడిపోతుంటారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటారు. ఇక మన సీనియర్ హీరోలు మాస్ ఓరియాంటెడ్ లైన్ నుంచి బయటకు రావడం లేదు. నా సామిరంగ సినిమానే తీసుకుంటే..సినిమా ఫర్వాలేదు అనిపిస్తుంది. పాత చింతకాయ కథనే అయినప్పటికీ ఏదో కొద్దిగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. ఇక నరేశ్ పాత్ర ఎమోషన్ పండిస్తుంది. అంతే మినిమం గ్యారెంటీగా తీశారు తప్ప.. అందులో కొత్తదనం ఏమీ లేదు.

    ఏదో తీయాలి కాబట్టి తీస్తున్నారు అనిపిస్తుంది ఈ కథలను చూస్తే. ఇక నాగ్ తన ఫోకస్ అంతా షోలపై పెట్టాడు. ఇలా  ఏడాదికో సినిమా తీయాలి లేదంటే ఆడియన్స్ తో  డిస్టెన్స్ వస్తుందనే ఆలోచన ఆయనలో ఉన్నట్టుంది. నాగార్జున తో సహ పలువురు సీనియర్ హీరోల లెక్కలు మారాలి. తమిళంలో సూర్య, తెలుగులో నాని వంటి వారిని చూసైనా కథల ఎంపిక ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి. కథను కొత్తగా, ఆడియన్స్ ఆకట్టుకునేలా సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. అదే సూపర్ ఫార్ములా. అంతే కాని ఏదో బీడీ కాల్చి, లుంగీ కట్టి, ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, ఓ మదర్ సెంటిమెంటో, బ్రదర్ , సిస్టర్ సెంటిమెంటో పండిస్తే.. ఆ సినిమా జనాలను ఎలా ఆకట్టుకుంటుంది. అందుకే కొత్తగా ఆలోచించాలి. అలా తీసిన సినిమాలకు జనాల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Legendary Actor Nagabhushanam : పంచె కడితే విలన్.. సూటు తొడిగితే బ్యాడ్ మాన్!

    విలక్షణ నటుడు నాగభూషణం జయంతి నేడు..(19.04.1921) ఒక్కన్నే నమ్ముకున్నది సాని.. పది మందికి...

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...