36.6 C
India
Thursday, May 30, 2024
More

  Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

  Date:

  Megastar Chiranjeevi
  Megastar Chiranjeevi and Shivaji

  Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్ అని కొలువబడిన నటుడు. నాలుగు దశాబ్దాలైనా మెగాస్టార్ ప్రభ ఏమాత్రం తగ్గలేదు. చిరు అంటే ఇప్పుడు ఓ వ్యక్తి కాదు..ఆయనొక శక్తి అని చెప్పాలి. చిరంజీవి అంటే కోట్లాది అభిమానుల ఆరాధ్య నటుడే కాదు అంతకుమించి గొప్ప మానవతావాది. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇతర ఇండస్ట్రీలోనూ చిరు సాయం అందుకోని వారు లేరు.

  ఎప్పుడు ఎవరికీ ఆపద వచ్చినా ఆదుకునే మొదటి వ్యక్తి చిరంజీవి. చేసిన సాయం చెప్పుకోవడం సభ్యత కాదు కాబట్టి ఆయన ఎప్పుడు చెప్పుకోరు. మీడియా ద్వారా అవే బయటకు వస్తుంటాయి. అలాగే ఆయన దగ్గర సాయం తీసుకున్నవారు చెప్పుకుంటే బయటకు వస్తాయి.  తాజాగా నటుడు శివాజీ తనకు చిరంజీవి అందించిన ఆర్థిక సాయంపై ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

  శివాజీ కమెడియన్ గా, నటుడిగా అందరికీ సుపరిచితుడే. మొన్నటి బిగ్ బాస్, 90’ఎస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ ద్వారా గొప్పగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇక శివాజీ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. సమయం వచ్చినప్పుడల్లా చిరంజీవి గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు. తాజాగా ఇంటర్వ్యూలో చిరు తనకు  చేసిన సాయంపై మాట్లాడుతూ..‘‘మాస్టర్ సినిమా చేసేటప్పుడు ఆయనకు నేను ఓ అభిమానిగా, ఒక ఆర్టిస్టుగా మాత్రమే తెలుసు.

  సినిమా షూటింగ్ ఫుల్ జోష్ గా జరుగుతోంది. అప్పుడు నా దగ్గర రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు. కొంచెం ఇబ్బంది పడుతున్నాను. నేను లేనప్పుడు ఈ విషయం ఎవరో చిరుకు చెప్పారట. ఓ రోజు షూటింగ్ అయ్యాక చిరంజీవి నా దగ్గరకు వచ్చి పదివేల రూపాయలు ఇచ్చారు. నేను ఎందుకు.. వద్దని అంటున్నా ఇచ్చారు. ఆ డబ్బులతో సంవత్సరం వరకు నాకు రెంట్ కు ఇబ్బంది కలుగకుండా చేశారు. అప్పటికీ నేను ఆయనకు అంతగా తెలియదు. ఆ సినిమాలోనే పరిచయం. చిన్న ఆర్టిస్టుని. అయినా నాకోసం ఆయన పదివేల రూపాయలు ఇచ్చారు.’’ అంటూ గుర్తుచేసుకున్నారు.

  Share post:

  More like this
  Related

  Karthikeya Temple : హోసూరు కార్తికేయ ఆలయంలో వింత

  - హారతి సమయంలో పాల్గొన్న మయూరం Karthikeya Temple : హోసూరు కార్తికేయ...

  TG Raja Mudra : తెలంగాణ ప్రభుత్వ నూతన రాజముద్ర ఇదే

  TG Raja Mudra : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ...

  Manmohan Singh : మోదీవి విద్వేష ప్రసంగాలు..: మాజీ ప్రధాని మన్మోహన్

  Manmohan Singh : ఎన్నికల ప్రచారంలో విపక్షాలను లేదా ఓ వర్గాన్ని...

  Hyderabad News : కుత్బుల్లాపూర్ లో దారుణం.. క్యాబ్ డ్రైవర్ ను గాయపరిచి దోపిడీ

  Hyderabad News : హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో దారుణం జరిగింది. అర్ధరాత్రి...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Supreme Hero : సుప్రీం హీరోను ఆటపట్టించిన స్టార్ హీరోయిన్లు..

  Supreme Hero Chiranjeevi : టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఎదిగిన...

  NTR-Chiranjeevi : తారక్ కు మెగాస్టార్ విషెస్.. యంగ్ స్టార్ రీ ట్వీట్ ఏం చేశారంటే?

  NTR-Chiranjeevi : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ సెలబ్రిటీగా మారిన...

  Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

  Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

  Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

  Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...