31.9 C
India
Friday, May 17, 2024
More

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    Date:

    CSK VS PK
    CSK Vs PBSK

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమైన చెన్నై మ్యాచ్ ను ఈజీగా పంజాబ్ కు అప్పగించేసింది. 20 ఓవర్లకు చెన్నై 162 పరుగులు చేయగా.. అందులో పంజాబ్ బౌలర్లు ఎక్స్ ట్రా రూపంలో 18 పరుగులు ఇచ్చారు. పంజాబ్ స్పిన్నర్లు రాహుల్ చాహర్, హర్ ప్రీత్ బ్రార్ ఇద్దరు నాలుగు ఓవర్ల చొప్పున వేసి చెరో రెండు వికెట్లు తీశారు. వీరిద్దరూ వేసిన 8 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇవ్వడంతో పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందని అర్థమైపోయింది.

    చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే హాప్ సెంచరీ చేశాడు. 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 62 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రద స్కోరు అందించడంలో సక్సెస్ అయ్యాడు. కానీ శివమ్ దూబె డకౌట్, జడేజా 4 పరుగుల కే వెనుదిరగడంలో చెన్నై తక్కువ పరుగులకే  పరిమితం కావాల్సి వచ్చింది.

    అనంతరం చేజింగ్ కు దిగిన పంజాబ్ కు జానీ బెయిర్ స్టో, ప్రభుసిమ్రన్ మంచి ఆరంభమే ఇచ్చారు. 19 పరుగుల వద్ద ప్రభు సిమ్రన్  అవుట్ అయినా.. జానీ బెయిర్ స్టో రాణించాడు. 30 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 46 పరుగులు చేశాడు. ర్యాలీ రోసో కూడా 23 బంతుల్లోనే 5 ఫోర్లు రెండు సిక్సులతో 43 పరుగులు చేసి జట్టు విజయం లో కీలక పాత్ర పోషించాడు.

    చివర్లో నిలకడగా ఆడిన శశాంక్ సింగ్ (25) సామ్ కర్రన్ లు  (26) పరుగులతో  మిగతా పనిని పూర్తి చేసి పంజాబ్ కు ఈ సీజన్ లో నాలుగో విజయాన్ని అందించాడు. దోని ఇప్పటి వరకు ఈ సీజన్ లో అవుట్ కాకపోగా.. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్సింగ్స్ చివరి బంతికి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. పంజాబ్ దీంతో పది మ్యాచ్ లు ఆడి నాలుగు పాయింట్లలో 7 వ స్థానంలో ఉండగా.. చెన్నై నాలుగో స్థానానికి పడిపోయింది.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Bengali Girl Viral : ఐపీఎల్ కు హీట్ పెంచుతున్న బెంగాలీ.. అసలు ఎవరీమే?

    Bengali Girl Viral :  ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైదంటే చాలు క్రికెట్...

    DC Vs LSG : లక్నో ఢమాల్.. ఢిల్లీ గెలుపు

    DC Vs LSG : ఢిల్లీ క్యాపిటల్స్ తో అరుణ్ జైట్లీ...