Home EXCLUSIVE Virat Kohli : నీకు సాటి ఎవరూ లేరయా..  విరాట్ ఆల్ టైం బెస్ట్ రికార్డు

Virat Kohli : నీకు సాటి ఎవరూ లేరయా..  విరాట్ ఆల్ టైం బెస్ట్ రికార్డు

15
Virat Kohli
Virat Kohli

Virat Kohli : ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఆర్సీబీ 17 సీజన్లలో ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. కానీ విరాట్ కొహ్లి మాత్రం రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాడు. ఆర్సీబీ ప్లే ఆప్స్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో  ఓడిపోయినప్పటికీ విరాట్ మాత్రం సరికొత్త రికార్డు సృష్టించాడు. విరాట్ కొహ్లి  గ్రేట్ ఫామ్ లో ఉన్నాడు. ఈ సీజన్ లో విరాట్ ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.  ఇంకా రెండు మ్యాచులు మిగిలి ఉన్నా కూడా ఈ సీజన్ లో  ఎవరూ అతడి దరిదాపుల్లో కూడా లేరు.

అయితే విరాట్ కొహ్లి 17 సీజన్లలో మొత్తం 8000 పరుగులు చేసి రికార్డులు బద్దలు కొట్టాడు. ఆర్సీబీ ప్లే ఆప్స్ కు చేరుకోకపోయినా కూడా కొహ్లి మాత్రం తన రికార్డులతో ప్రభంజనం సృష్టించాడు. గ్రేట్ బ్యాటింగ్ తో 130 కి పైగా స్ట్రైక్ రేట్ తో ఐపీఎల్ లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో విరాట్ కొహ్లి 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 8 వేల మార్కును దాటి ఎవరికీ అందనంత ఎత్తుకు  చేరుకున్నాడు.

ఐపీఎల్ లో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల రికార్డు విరాట్ పైనే ఉండటం గమనార్హం. విరాట్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కానీ జట్టు మాత్రం ఇప్పటి వరకు కప్ గెలవలేదు.  విరాట్ ఒక సీజన్ లో 5 ఐపీఎల్ సెంచరీలు చేసి ఔరా అనిపించాడు.

ప్రస్తుతం ఈ సీజన్ లో సెంచరీ చేయకపోయినా 8 సెంచరీలతో ఐపీఎల్ లో అత్యధిక సెంచరీల వీరుడిగా కూడా కొనసాగుతున్నాడు.  విరాట్ రికార్డులు బద్దలు కొట్టాలన్నా ఇప్పటి తరం వారికి సాధ్యపడకపోవచ్చు. ఆర్సీబీ ఫైనల్ కు చేరకపోయినా విరాట్ రికార్డులతో ఆర్సీబీ ఊరట పొందుతోంది.