Home BREAKING Modi met LK Advani : ఎల్ కే అద్వానీని కలిసిన మోదీ.. ప్రమాణ స్వీకారానికి...

Modi met LK Advani : ఎల్ కే అద్వానీని కలిసిన మోదీ.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

11
Modi met LK Advani
Modi met LK Advani

Modi met LK Advani : పీఎం నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీని కలుసుకొని ఆయనతో సమావేశమయ్యారు. అద్వానీ ఇంటికి వెళ్లిన మోదీ కాసేపా ఆయనతో ముచ్చటించారు. అద్వానీకి పుష్పగుచ్చం అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. జూన్ 9న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అద్వానీని మోదీ ఆహ్వానించారు. అనంతరం అద్వానీ ఇంటి నుంచి మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇంటికి మోదీ వెళ్లారు.

ఈరోజు ఎన్డీయే పక్ష నేతగా మూడోసారి నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఏర్పాటు చేసిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశంలో ఎన్డీయే కూటమి ఈ మేరకు ఎన్నుకుంది. ఎన్డీయే పక్ష నేతగా మోదీ పేరును రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించగా అమిత్ షా, గడ్కరీ, కుమారస్వామి, చంద్రబాబు, నితీశ్ బలపరిచారు.