Home EXCLUSIVE Bro Movie : పవన్ ను వెండితెర మీద చూడటమే కావాలంటున్న అభిమానులు

Bro Movie : పవన్ ను వెండితెర మీద చూడటమే కావాలంటున్న అభిమానులు

80

Bro Movie :

పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో. జులై 28న విడుదలై సంచలనంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో పండుగ వాతావరణం మొదలైంది. చాలా రోజుల తరువాత సినిమా రావడంతో వారి ఆనందానికి హద్దులు లేవు. ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ నటన సినిమాకు హైలైట్ అంటున్నారు.

సినిమా ఎలా ఉన్నా మా హీరోను చూడటమే కావాలని అభిమానులు అంటున్నారు. తెర మీద చూడటమే మాకు ప్రధానం అని చెబుతున్నారు. తెర మీద పవన్ చేసే నటన మమ్మల్ని ఆకట్టుకుంటుందని పేర్కొంటున్నారు. బ్రో సినిమాలో పవన్ నటనకు అందరు ఫిదా అవుతున్నారు. బ్రో సినిమా విడుదలై ప్రేక్షకులకు పండగ తీసుకొచ్చింది.

సముద్రఖని దర్శకత్వంలో త్రివిక్రమ్ మాటలు అందించారు. పవన్ కల్యాణ్ సినిమాలకు త్రివిక్రమ్ వరుసగా పని చేస్తున్నారు. భీమ్లానాయక్ కు కూడా మాటలు రాశారు. అలా పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పవన్ కు కాస్త ఘాటుగానే మాటలు రాశారు. కానీ సాయిధరమ్ తేజ్ కు మాత్రం అంత పవర్ ఫుల్ డైలాగులు లేకపోవడం గమనార్హం.

బ్రో సినిమాలో పవన్ కు కాస్త ఘాటు మాటలే రాశాడు. మాకు సినిమా ముఖ్యం కాదు పవన్ ను తెర మీద చూడటమే ప్రధానమని చెబుతున్నారు. వెండితెర మీద పవన్ కల్యాణ్ ను చూస్తే చాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేదు. అతడి సినిమా చూడటమే మాకు కావాలని అంటున్నారు. మొత్తానికి బ్రో సినిమా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుందని చెబుతున్నారు.