35.3 C
India
Tuesday, May 21, 2024
More

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    Date:

    AP Elections
    AP Elections

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళ గిరి నుంచి పోటీలో ఉన్నారు. అదేవిదంగా పిఠాపురం నుంచి జనసేన అధినేత రంగంలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా కూటమి నాయకులే కావడం విశేషం. కూటమిగా ఏర్పడిన నాయకుల లక్ష్యం ఒకటే. అది వైసీపీ నేత, ప్రస్తుత సీఎం జగన్ ను ఇంటిదారి పట్టించడమే. ఆ ముగ్గురు కలిసి జగన్ ను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. అంతే పట్టుదలతో జగన్ కూడా ముగ్గురు ప్రధాన నాయకులను ఓడించడానికి పట్టుదలతో ఉన్నారు.

    కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను ఓడించడానికి ఆ మూడు నియోజక వర్గాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకోడానికి డబ్బు, మద్యం పంపిణి చేస్తున్నట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాటితో పాటు ఓటుకు నాలుగు వేల రూపాయలను కూడా పంపిణి చేస్తున్నట్టుగా ఆరోపణలు గుప్పుమన్నాయి.  కూటమికి చెందిన ద్వితీయ, తృతీయ నేతలకు డబ్బుతో ఆశలు పెడుతున్నట్టుగా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

    కుప్పం, మంగళ గిరి, పిఠాపురం నియోజకవర్గంలో ఎలాగయినా వైసీపీ అభ్యర్థులు గెలవాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు.  ముగ్గురు ప్రధాన నాయకులు ఓటమిపాలైతే తెలుగు దేశం, జనసేన పార్టీల నుంచి ఎవరు గెలిచినా రెండు పార్టీలు బలహీన పడుతాయి. ఒకవేళ అత్తెసరు మెజార్టీ వచ్చినా , రెండు పార్టీల నుంచి గెలిచిన వారిని ఆకట్టుకోవదానికి సులువవుతుంది. ఈ ఆలోచనతో వైసీపీ ఆ మూడు నియోజకవర్గాల్లో  ఓటుకు నాలుగు వేలు ఇవ్వడంతోపాటు మద్యం కూడా అదనంగా పంపిణి చేస్తోందనే ఆరోపణలు కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు.

    వైసీపీ కుట్రను తిప్పికొట్టడానికి కూటమి నేతలు కూడా సిద్దంగానే ఉన్నారు. మూడు ప్రాంతాల్లో ముఖ్యమైన నాయకులను గెలిపించు కోవాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రలోభాలకు లొంగకుండా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నాయకత్వం చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కూటమి మేనిఫెస్టో ను వివరిస్తూ ప్రచారం చేస్తూ ఆకట్టుకున్న తీరు ఏ మేరకు ఫలితం ఇవ్వనుందో వేచిచూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...