Home EXCLUSIVE Sita Rama : ఆ కొబ్బరి చెట్ల మాటున సీతారాములు.. చూసి తరించండి

Sita Rama : ఆ కొబ్బరి చెట్ల మాటున సీతారాములు.. చూసి తరించండి

28
Sita Rama
Sita Rama

Sita Rama : భారత సంస్కృతిలో, భారతీయుల జీవన విధానంలో సీతారాముల దంపతులకు ప్రత్యేక స్థానముంది. ఈ దేశంలో కొమ్మ, రెమ్మ, చిరుగాలి.. ఇలా అణువణువు జై శ్రీరామ్ అనే అంటుంది. భారతీయుల ఆదర్శ జీవనానికి సీతారాములు ప్రతీకగా వేలాది సంవత్సరాలుగా కొలువబడుతున్నారు. రాముడి కాలంలో  భారత దేశంలో ఆదర్శ పాలన కొనసాగడంతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. అందుకే ఈనాటి పాలకులు సైతం రామరాజ్యం తెస్తామని హామీలు ఇస్తుంటారు.

పుణ్యదంపతులుగా సీతారామచంద్రస్వామి వారిని హిందువులు నేటికీ కొలుస్తారు. వైవాహిక బంధానికి ఆదర్శమూర్తులుగా వారిని కొనియాడుతుంటారు. అందుకే నూతన దంపతులను సీతారాములుగా ఉండాలని దీవిస్తుంటారు. రామయ్యకు ఎన్ని కష్టాలు వచ్చినా సీతమ్మ ఆయన చేయి విడవలేదు. తన పతి ఎక్కడుంటే తాను అక్కడే ఉంటానని విలాసవంతమైన మహారాణి జీవితాన్ని విడిచి రాముడి వెంట అడవులకు బయలుదేరింది. సుకుమారమైన సీతమ్మను రాళ్లు, రప్పలు, వాగులు, వంకలు, క్రూరమృగాల నడియాడే అడవుల్లో రాముడు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకెళ్తే..ఆమె కోసం శ్రీరాముడు తపించని క్షణం లేదు. సంవత్సరాల తరబడి ఆమె కోసం వెతికి.. చివరకు రావణుడిని చంపి సీతమ్మను ఇంటికి తీసుకొస్తాడు రాముడు. ఇక రావణాసురుడి చెరలో ఉండగా సీతమ్మ ఒక్క రోజు కూడా పరాయి పురుషుడిని తల ఎత్తి చూడలేదు. నా రాముడు వస్తాడు..శత్రువధ చేసి తనను తీసుకెళ్లాడు అని ప్రతీ క్షణం శ్రీరామ నామస్మరణలో బతికింది. చివరకు అదే జరిగింది. రామయ్య వచ్చి లంకను కూల్చి రావణుడి హతమార్చి.. అయోధ్యకు వెళ్లి రాజ్యాన్ని చేపడుతారు.

ఈ సీతారాముల గాథ వేల సంవత్సరాలుగా భారతీయుల జీవనంలో పెనవేసుకుపోయింది. ఈ దేశంలో ఏ రాయిని మీటినా శ్రీరామ నామమే పలుకుతుంది. ఏ ప్రకృతి దృశ్యాన్ని చూసినా సీతారాముల రూపమే కనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి దృశ్యమే ఉన్న ఓ అద్భుత ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోను మాములుగా చూస్తే సీతారాములు పరిణయం చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. కానీ అదే ఫొటోను జూమ్ చేసి చూస్తే మాత్రం అక్కడ కొబ్బరి చెట్లు, వాటి కొమ్మలు మాత్రమే కనిపిస్తాయి. ఈ అద్భుత చిత్రం తెగ వైరల్ అవుతోంది. మొన్న శ్రీరామ నవమి సందర్భంగా ఈ ఫొటోను ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. దీన్ని చూసిన ప్రతీ ఒక్కరు జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేయడం విశేషం.