ఆగస్టు 5 న ఒకే రోజున విడుదలైన చిత్రాలు బింబిసార , సీతారామం . అంతకుముందు వరకు టాలీవుడ్ లో పలు చిత్రాలు విడుదల అవ్వడం ప్లాప్ అవుతుండటంతో ఈ చిత్రాలు ఏమౌతాయో అనే టెన్షన్ లో ఉంది చిత్ర పరిశ్రమ. సరిగ్గా ఆగస్టు 5 న విడుదలైన ఈ రెండు చిత్రాలకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కట్ చేస్తే బింబిసార , సీతారామం రెండు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార టైం ట్రావెల్ కథ. క్రూరుడిగా , అలాగే మంచివాడిగా రెండు వేరియేషన్స్ చూపించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లు చాలా పెద్ద ఎత్తున లాభాలు పొందారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 65 కోట్లకు పైగా వసూళ్లను సాధించి కళ్యాణ్ రామ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచింది.
ఇక సీతారామం గురించి పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి మొదట్లో. ఎందుకంటే ఈ చిత్రానికి దర్శకుడు హను రాఘవపూడి. అతడు దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలు అలా వచ్చాయి …. ఇలా వెళ్లిపోయాయి. అంతెందుకు హను దర్శకుడు అంటే అగ్ర నిర్మాత అశ్వనీదత్ కూడా భయపడ్డాడట ……. అవసరమా ? అని. కట్ చేస్తే సీతారామం మ్యాజిక్ చేసింది ….. బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. దాదాపు అన్ని భాషల్లో కలిపి 100 కోట్ల వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ రెండు సినిమాలు కూడా దిగ్విజయంగా 50 రోజులను పూర్తి చేసుకున్నాయి. సీతారామం చిత్రం ఆల్రెడీ ఓటీటీ లో కూడా విడుదల అయ్యింది అమెజాన్ ప్రైమ్ లో. ఇక త్వరలోనే కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రం కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రానుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అవ్వడం ….. టాలీవుడ్ కు కనకవర్షం కురిపించడంతో మళ్ళీ మంచి రోజులు వచ్చాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.