Home VENDITHERA BOLLYWOOD Kareena Kapoor : చిన్న వయసులోనే ఆ తప్పు జరిగింది! ఆ రాత్రుల అనుభవం మర్చిపోలేను.....

Kareena Kapoor : చిన్న వయసులోనే ఆ తప్పు జరిగింది! ఆ రాత్రుల అనుభవం మర్చిపోలేను.. స్టార్ హీరోయిన్ సంచలన విషయాలు..

16
Kareena Kapoor
Kareena Kapoor

Kareena Kapoor :   పాన్ ఇండియా పదం వచ్చిన తర్వాత ప్రతీ ఇండస్ట్రీ నుంచి హీరోలు, హీరోయిన్లు గుర్తింపు దక్కించుకుంటున్నారు. కానీ గతంలో చాలా తక్కువ మందే దేశం మొత్తం తెలిసే వారు వారిలో నేషనల్ బ్యూటీ కరీనా కపూర్ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసేంత అందం ఆమె సొంతం. దీనికి తోడు మైమరపించే నటనతో మెప్పించేది కూడా. చాలా కాలం ఇండస్ట్రీలో ఆమె హవా కొనసాగించింది. ఈ మధ్య కాలంలో కాస్తంత స్లో అయ్యింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో కరీనా తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన చేదు సంఘటనలను పంచుకుంది.

స్టార్ హీరోయిన్‌గా హవా..
‘రెఫూగీ’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కరీనా కపూర్. ఇందులో అందంతో పాటు నటనతో మెప్పించడంతో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ డం సంపాదించుకుంది. ఇలా రెండు దశాబ్దాలు పాన్ ఇండియా మార్క్ చూపింది. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో కరీనా సీక్రెట్‌గా డేటింగ్ కొనసాగించింది. ఆ తర్వాత ఆయననే పెళ్లి చేసుకుంది. అంత స్టార్‌డం ఉన్న హీరోయిన్ రెండో భార్యగా వెళ్లడం అప్పట్లో పెద్ద టాపిక్ అయ్యింది.
బ్రేక్ లేకుండా..
కరీనా కపూర్ పెళ్లి తర్వాత కూడా ప్రయాణాాన్ని కొనసాగించింది. ఈ బ్యూటీ.. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడూ.. తల్లయిన తర్వాత కూడా వ్యాపార ప్రకటనల్లో నటించింది. కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఇద్దరు బిడ్డల తల్లయిన తర్వాత కూడా కరీనా తన ప్రభావాన్ని కోల్పోలేదు.

వరుస ప్రాజెక్టులతో..
2022లో కరీనా ‘లాల్ సింగ్ చద్దా’తో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఇది నిరాశను మిగిల్చింది. గతేడాది ద బకింగ్ హమ్ మర్డర్,  ‘జానే జాన్’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు ‘ది క్రూ’, ‘సింగం ఎగైన్’తో రాబోతోంది. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్ లకు కూడా సైన్ చేసింది. ‘ది క్రూ’ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. మాట్లాడుతూ ‘నా పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. గతంలో ఎక్కువ ఫ్లాపులు చూశాను.. చిన్న వయస్సులో ఉండడం వల్ల ఈ తప్పులు జరిగాయి’ అని చెప్పింది.
ఆ రాత్రులు..
కరీనా మాట్లాడుతూ.. ‘జబ్ వివీమెట్‌’ కంటే ముందు నేను చేసిన మూవీలు ఎక్కువగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఎందుకు నా సినిమాలు ఆడడం లేదు..? సమస్య ఎక్కడి నుంచి ఏర్పడుతుంది..? తెలియక ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా. ఇప్పటికీ ఆ రాత్రులను తలచుకుంటే బాధేస్తుంది’ అని వివరించింది.