Home VENDITHERA BOLLYWOOD Casting Couch Tamanna : నన్ను కూడా పక్కలోకి రమ్మన్నారు.. తమన్నా ఓపెన్ కామెంట్స్

Casting Couch Tamanna : నన్ను కూడా పక్కలోకి రమ్మన్నారు.. తమన్నా ఓపెన్ కామెంట్స్

13
Heroine Tamannaah
Heroine Tamannaah
Casting Couch Tamanna
Casting Couch Tamanna, Tamanna Webseries

Casting Couch Tamanna : ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా సరే కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. చాలామంది దాని బారిన పడి నలిగిపోతున్నారు. ఇంకొందరు ఎంచక్కా కమిట్ మెంట్లు ఇచ్చి మరీ ఛాన్సులు పడుతున్నారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారిలో చాలామంది ఇలాంటి పనులు చేసి అవకాశాలు అందుకున్న వారు కూడా ఉన్నారు. కానీ అలాంటి వారు ఇప్పుడు నోరు తెరవరు.

కానీ మీటూ ఉద్యమం తర్వాత చాలామంది దాని మీద నోరు విప్పుతున్నారు. తాజాగా తమన్నా వంతు వచ్చింది.  ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. మొన్నటివరకు సౌత్ ఇండస్ట్రీని ఊపేసింది ఈ హాట్ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమెమాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది.

ఇందులో ఆమె మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని ఇండస్ట్రీలలో ఉంది. మొదట్లో దాన్ని నేను పెద్దగా నమ్మలేదు. కానీ తర్వాత నాకు ఓ సారి అనుభవం ఎదురైంది. ఓ డైరెక్టర్ నేరుగా కమిట్ మెంట్ అడిగాడు. సీరియస్ గా అతనికి బదులిచ్చాను. అప్పటి నుంచి అతను నా జోలికి రాలేదు. ఆ తర్వాత అతనితోనే నేను రెండు సినిమాలు చేశాను.

అప్పట్లో నేను సినిమాలకు పనికి రానని చాలామంది అన్నారు. కానీ నా స్వయం కృషితోనే ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ తెలిపింది తమన్నా. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే తమన్నాను కమిట్ మెంట్లు అడిగింది ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు ఇప్పుడు. ఇక తమన్నా ఇప్పుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.