ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె బిగ్ బాస్ తోనే చాలా ఫేమస్ అయింది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినా పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
దాని తర్వాత కూడా వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమెకు కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న వచ్చింది. దానిపై ఆమె మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. కానీ దాని విషయంలో ఎవరి ఇష్టం వారిది. కొందరు కమిట్ మెంట్లు ఇచ్చేసి అవకాశాలు పట్టేస్తుంటారు.
అలాంటి వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వారిది. కాబట్టి అందులో తప్పులేదు. సమాజంలో అంతకంటే పెద్ద సమస్యలు చాలానే ఉన్నాయి. కాబట్టి అందరూ అలాంటి వాటి మీద దృష్టిసారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఆమె ఈ రేంజ్ లో బోల్డ్ కామెంట్లు చేస్తుందని ఎవరూ ఊహించలేదు.