Home EXCLUSIVE Bhagwant Kesar Still in Losses : ఇంకా నష్టాల్లోనే ”భగవంత్ కేసరి”.. 2 వారాల్లో...

Bhagwant Kesar Still in Losses : ఇంకా నష్టాల్లోనే ”భగవంత్ కేసరి”.. 2 వారాల్లో రాబట్టింది ఎంత.. ఇంకా ఎంత రాబట్టాలంటే?

10
Bhagwant Kesar Still in Losses
Bhagwant Kesar Still in Losses

Bhagwant Kesar Still in Losses : నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత మళ్ళీ ఆడియెన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ ”భగవంత్ కేసరి”.. వరుసగా హిట్స్ అందుకుంటూ సీనియర్ హీరోల్లోనే టాప్ లో రాణిస్తున్న బాలయ్య మరో హిట్ అందుకున్నాడు. దీంతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నట్టు చెప్పాలి.

అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ ”భగవంత్ కేసరి”.. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. భగవంత్ కేసరి మంచి టాక్ రావడంతో బాలయ్య కలెక్షన్స్ తో సునామీ సృష్టిస్తున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 67.35 కోట్ల బిజినెస్ చేయగా 68 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.. మరి ఈ సినిమా రెండు వారాల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందంటే.. 14 రోజుల్లో భగవంత్ కేసరి థియేటర్స్ లో ఎంత రాబట్టింది అనేది చుస్తే.. దసరా సెలవల్లో ఉన్నంత క్రేజ్ ఈ సినిమాకు ఇప్పుడు లేదు అనే చెప్పాలి.

రోజురోజుకూ క్రేజ్ పడిపోతూ కలెక్షన్స్ గ్రాఫ్ కూడా తగ్గిపోతూ వస్తుంది. 14వ రోజు కేవలం 45 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా 65 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు దూరంలోనే ఉంది.. 3 కోట్లకు పైగానే రాబడితే కానీ ఈ సినిమా లాభాల్లోకి వచ్చే అవకాశం లేదు. మరి ఈ వీకెండ్ తో అయినా ఈ సినిమా టార్గెట్ ఫినిష్ చేస్తుందో లేదో చూడాలి.