Home POLITICS ANDHRA PRADESH Mudragada with JanaSena : జనసేనతో ముద్రగడ.. కాపులు ఏపీలో ఏకమవుతున్నారా?

Mudragada with JanaSena : జనసేనతో ముద్రగడ.. కాపులు ఏపీలో ఏకమవుతున్నారా?

16
Mudragada with JanaSena
Mudragada with JanaSena

Mudragada with JanaSena : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో  త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే వైసిపి, టిడిపి పార్టీలు గెలుపు గుర్రాల కోసం  కోసం అన్వేషణ మొదలు పెడుతూ మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలోని జనసేన పార్టీ కూడా సీనియర్ నేతల కోసం వేట మొదలు పెట్టింది. ఇందులో భాగంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ను జనసేన పార్టీలోకి ఆహ్వానించేందుకు పార్టీ అధిష్టానం తమ నాయకులను ముద్రగడ దగ్గరికి పంపింది. జనసేన నాయకులు ముద్రగడతో భేటీ కావడం ఇప్పుడు ఉత్కంఠం రేపుతోంది.

పార్టీలోకి రావాలని జనసేన నేతలు ముద్రగడకు తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే ముద్రగడ జనసేన నేతలకు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టంమవుతోంది. ముద్రగడ నుంచి ఇప్పటికి ప్పుడు స్పందన లేకపోయినా మరొకసారి జనసేన ముఖ్య నేతలు ఆయనతో సమావేశం అయి పార్టీలోకి రావాలని ఆహ్వానిం చినట్లు తెలుస్తోంది.

గోదావరి జిల్లాల్లో ఎవరికి పట్టు చిక్కితే వారికి అధికారం దక్కినట్లే. టీడీపీ, జనసేన పొత్తుతో ఈ సారి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలనేది చంద్రబాబు వ్యూహం. ఈ సమయంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడ తో వైసీపీ నేతలు వరుస మంతనాలు జరిపారు. ముదగ్రడ తన కుమారుడుతో సహా వైసీపీలో చేరటం ఖాయమని ప్రచారం సాగింది. దీని పైన అధికారికంగా మాత్రం ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గతంలోని  వారాహి యాత్ర లో  ద్వారంపూడి పై అనేక ఆరోపణలు చేశారు. కాపు నాయకుడు పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అప్పట్లో ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేనకి ఒక లేఖను రాశారు. మీ ప్రసంగాల్లో పదే పదే తొక్కతీస్తా.. నార తీస్తా.. చెప్పుతో కొడతా.. కింద కూర్చొబెడతా.. గుండు గీయిస్తా అని అంటున్నారు.. ఇప్పటి వరకు అలా ఎంతమందిని చేశారో చెప్పండని ఆయన   ప్రశ్నించారు. కేవలం ఎమ్మెల్యేలను తిట్టడం కోసమే సమయం వృధా చేసుకోవద్దని సూచించారు.

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిది గౌరవప్రదమైన కుటుంబం అని.. కాకినాడ ఎమ్మెల్యే, అతని తండ్రి, తాత తప్పుడు మార్గాల్లో సంపాదించారనడం తప్పు అని పేర్కొన్నారు. కాపు ఉద్యమాలకు సహకరించిన వారిని విమర్శించడం సరికాద న్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు ఉండరని చెప్పారు. చాలెంజ్ చేసిన ట్లుగా పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పోటీ చేసి సత్తా చూపండని అన్నారు.

గత  అనుభవాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ కు కాపునేత ముద్రగడకు మధ్య చాలా గ్యాప్ ఉంది. ప్రస్తుతం జనసేన నేతలు ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తే వెళ్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో కాపు నేతలపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ పై ముద్రగడకు మంచి అభిప్రాయం లేదు. ఈ తరుణంలో పార్టీలోకి ఎలా వెళ్తారని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయప డుతున్నారు.

ఏది ఏమైనా జనసేన నేతలు పట్టు విడవకుండా వైసిపి కంటే ముందు కాపు నేతలని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ముద్రగడతో కాపులందరూ ఐక్యంగా ఉన్నారని ముద్రగడ ఎక్కడ ఉంటే అక్కడ కాపులు ఉంటారన్న సంకేతం వెలువడటంతో రాజకీయ మంతా కాపు నేత ముద్రగడ చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు ముద్రగడ ఏ పార్టీకి మద్దతి స్తారని అంశం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది.