Home VENDITHERA BOLLYWOOD Pushpa 2 : ‘పుష్ప’ కూడా ఆ మూవీ దారిలోనే వెళ్తున్నాడా?

Pushpa 2 : ‘పుష్ప’ కూడా ఆ మూవీ దారిలోనే వెళ్తున్నాడా?

16
Pushpa 2
Pushpa 2

Pushpa 2 : పుష్ప: ది రైజ్..  తెలుగు తెర మీదే  భారతీయ సినీ పరిశ్రమ పైనే  ఒక సంచలనం నమోదు చేసింది. ఒక ప్రాంతీయ సినిమా ఈ స్థాయిలో హిట్టవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్స్, నడక, స్టైల్స్ ఖండాంతరాలను దాటాయి. బాలీవుడ్ హీరోలు మొదలు క్రికెట్ ప్లేయర్ల వరకు పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజమ్స్ ఇమిటేట్ చేశారంటే ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. సౌత్ తో పాటు నార్త్ బెల్ట్ లోనూ ఈ సినిమా అనూహ్య వసూళ్లను రాబట్టింది.

టీమ్ అందరికీ వెల్లువలా అవకాశాలు..
ఈ సినిమా దర్శకుడు సుకుమార్ తో పాటు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీపసాద్ తో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్లను తమతో సినిమా చేయాలంటూ దర్శక నిర్మాతలు వెంటపడుతున్నారు.  అప్పటికే విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ప్రూవ్ చేసుకున్న ఫాహద్ ఫజిల్ కు పుష్ప సినిమా తో మరిన్ని అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఇందులో చేసిన భన్వర్ లాల్ షెకావత్ విపరీతమైన ప్రభావం చూపింది.

పార్ట్-2తో బాలీవుడ్ బెంబేలు
పుష్ప-2 సినిమా ఆగస్టు 15న విడుదల కానుండడంతో బాలీవుడ్ బెంబేలెత్తిపోతున్నది. ఈ సినిమా డిస్ర్టిబ్యూషన్ హక్కుల కోసం బాలీవుడ్ సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో మరో సినిమా రిలీజ్ చేసేందుకు బాలీవుడ్ దర్శకనిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం  రాబోయే సినిమాల్లో  హయ్యెస్ట్ బజ్ ఉన్నది పుష్ప-2 కు మాత్రమే అంటే అతిశయోక్తికాదు..

కేజీఎఫ్ బాటలో పుష్ప
కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి కేజీఎఫ్  పార్ట్ ఎంత విజయం సాధించిందో కేజీఎఫ్-2 అంతకన్నా పెద్ద విజయం సాధించింది. పార్ట్-2 విడుదలై రెండేళ్లు దాటింది. ఈ సినిమా మూడో పార్ట్ కూడా ఉంటుందని క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదు. కానీ పార్ట్-3 ఉంటుందని మాత్రం దర్శకుడు చెబుతున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో పుష్ప కూడా పార్ట్-3 ఉంటుందనే లీకులు బయటకు వస్తున్నాయి. అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం దీనిపై నేరుగా చెప్పకున్నా మూడో పార్ట్ తీసే అవకాశాలు మాత్రం ఉన్నాయంటున్నారు. సో కేజీఎఫ్ లాగానే పుష్ప కూడా పార్ట్ -3 సిద్ధమవుతున్నాడని అర్థమవుతున్నది. ఆగస్టు 15న పార్ట్-2  రిలీజైతే పార్ట్-3 పై క్లారిటీ రానుంది.