Home VENDITHERA BOXOFFICE Kalki Movie : కల్కి.. రెండో రోజు ఊచకోత.. ఒక్క రికార్డు మిగలనివ్వలేదు..

Kalki Movie : కల్కి.. రెండో రోజు ఊచకోత.. ఒక్క రికార్డు మిగలనివ్వలేదు..

7

Kalki Movie Second Day
Kalki Movie Second Day

Kalki Movie Second Day : ప్రస్తుతం భారతదేశంలో కల్కి మేనియా నడుస్తున్నది. పురాణాలకు సైన్స్ ను జోడించి ఓ కొత్త ఊహాత్మక కథతో కల్కి2898ఏడీని  తెరకెక్కించి వండర్ ఫుల్ అనిపించుకున్నాడు  దర్శకుడు నాగ్ అశ్విన్. సూపర్ మేన్లు, బ్యాట్ మెన్లు కాదు హిందూ పురాణాల్లో అసలైన సూపర్ హీరోలు ఉన్నారని నిరూపించారు.

తెలుగు నుంచి వస్తున్న పీరియాడికల్ చిత్రాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. బాహుబలి నుంచి తెలుగు సినిమాలు భారతీయ సినీ తెరపై సరికొత్త  చరిత్రను సృష్టిస్తున్నాయి.
అదే కోవలో వచ్చిన మరో చిత్రం’కల్కి 2898 ఏడీ’ ఒకటి. రెబెల్ స్టార్ ప్రభాస్ మరోసారి భారతీయ సినీపరిశ్రమకు తన సత్తా ఏంటో చూపాడు. ప్రాంతం. భాషతో సంబంధం లేకుండా విడుదలైన ప్రతీ చోట భారీ వసూళ్లతో సునామీ సృష్టిస్తున్నాడు ప్రభాస్. తొలి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాగా, రెండో రోజు కూడా అదే జోరు చూపింది ‘కల్కి 2898 ఏడీ’.

కల్కి లెక్కలు ఇవే..
‘కల్కి 2898 ఏడీ’ మూవీ నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్ల  బిజినెస్ చేసింది. కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 370 కోట్లు ప్రీ రిలీస్ బిజినెస్  చేసింది.

రెండు రోజుల్లో 260 కోట్లు..  
‘కల్కి 2898 ఏడీ’ సినిమా రెండో రోజు కూడా బాగానే వసూళ్లు సాధించింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్లు షేర్ వసూలైంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకొని రూ. 40 కోట్లు కొల్లగొట్టింది. రెండు రోజుల్లో దాదాపు రూ. 134 కోట్ల షేర్‌తో పాటు రూ. 260 కోట్ల గ్రాస్‌ ను చేరుకుంది.  దీంతో గత సినిమాల రికార్డులన్నీ బద్దలయ్యాయి. ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్ర్కీన్ పై ప్రభాస్ దే పై చేయిగా ఉంది.