Home EXCLUSIVE Narayana Pirlamarla : నారాయణ పిర్లమర్లకు ‘ఆటా’ ఘన నివాళి

Narayana Pirlamarla : నారాయణ పిర్లమర్లకు ‘ఆటా’ ఘన నివాళి

22
Narayana Pirlamarla "Shradhanjali"
Narayana Pirlamarla “Shradhanjali”

Narayana Pirlamarla “Shradhanjali” : ఆటా వ్యవస్థాపక సభ్యుడు నారాయణ పిర్లమర్ల(75) పరమపదించారు.  ఎన్జేలోని ఫ్రీహోల్డ్ లోని ఆయన స్వగృహంలో  ఏప్రిల్ 2న ఇంట్లోనే కన్నుమూశారు. తెలంగాణలోని ఇస్మాయిల్ ఖాన్ పేటలో జన్మించిన ఆయన 1973లో అమెరికాకు వెళ్లారు. 1986లో నారాయణ తన భార్య డాక్టర్ జ్యోతి పిర్లమర్లతో కలిసి ఎన్ జేలోని ఫ్రీహోల్డ్ లో స్థిరపడడానికి ముందు న్యూయార్క్ నగరంలోని పలు చోట్ల నివసించారు. పదవీ విరమణ చేసే వరకు న్యూయార్క్ లోని ఇన్ స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో 25 సంవత్సరాలకు పైగా అకౌంటెంట్ గా పనిచేశారు.

నారాయణ సేవాతత్పరత, దయాగుణం, సామాజిక స్పృహ కలిగిన వారు. సహచరుల పట్ల ఆయన చూపే ప్రేమను ఎవరూ మరిచిపోలేరు. సాయం కోసం ఆయన దగ్గర వచ్చేవారికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఆయన  విజయానికి కారణం ఆయన కుటుంబమనే చెప్పవచ్చు. నారాయణ పిర్లమర్ల గొప్ప కుటుంబ వ్యక్తే కాదు..గొప్ప భర్త, తండ్రి, సోదరుడు, మామ,  తాత అని ఆయన స్నేహితులు చెబుతుంటారు. అన్నింటి కంటే “తాత” గా ఆయన తన పాత్రను విలువైనదిగా భావించారు.

భారతీయ, తెలుగు సమాజాల నిర్మాణంపై నారాయణ మక్కువ చూపారు. ఆయన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడు. ధర్మకర్తల మండలిలో వారి మొదటి సభ్యులలో ఒకరు. కోశాధికారిగా కూడా పనిచేశారు. నారాయణకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ బీచ్, పర్వతాల సందర్శనకు ఇష్టపడేవారు.

నారాయణకు సతీమణి డాక్టర్ జ్యోతి పిర్లమర్ల,  సోదరులు విఠల్ పిర్లమర్ల, రామ్ గుప్తా, సోదరి పుష్ప వేముల, కుమార్తెలు డాక్టర్ ప్రీతి పిర్లమర్ల, బిందు పిర్లమర్ల, ఆమె భర్త డేనియల్ యార్క్ ఉన్నారు. మనవరాళ్లు, కవి, కిరణ్, సోదరులు శేఖర్ పిర్లమర్ల, కృష్ణ పిర్లమర్ల ఉన్నారు.

అమెరికా తెలుగు సంఘం(అమెరికన్ తెలుగు అసోసియేషన్-ఆటా) ఆధ్వర్యంలో నారాయణ పిర్లమర్ల శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని స్థానిక రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ లో ఏప్రిల్ 10న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆటా కార్యవర్గం, శ్రేయోభిలాషులు, ఎన్ఆర్ఐ మిత్రులు భారీ సంఖ్యలో హాజరై నారాయణకు నివాళి అర్పించారు.

All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)

More Images : ATA Founding Member Narayana Pirlamarla “Shradhanjali”