Home EXCLUSIVE Instagram : రాత్రి ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువ సేపు గడపకుండా నిరోధించే ఫీచర్...

Instagram : రాత్రి ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువ సేపు గడపకుండా నిరోధించే ఫీచర్ వచ్చింది తెలుసా?

14
Instagram
Instagram

Instagram : సోషల్ మీడియా అంటే అందరికి పిచ్చే. తెల్లవారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. యువత అయితే చెప్పనక్కర్లేదు. గంటల తరబడి సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్రోగ్రాముల్లోనే గడిపేస్తున్నారు. దీంతో మానసిక ప్రశాంతత దెబ్బ తింటోందని వైద్యులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. అలాంటి వారి కోసం క్వైట్ అనే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ తో మనం ఎక్కువ సేపు ఇన్ స్టా గ్రామ్ చూస్తుంటే అలర్ట్ చేస్తుంది. రాత్రి వేళల్లో అదే పనిగా చూసేవాని నైట్ టైం నడ్జెస్ సూచనలు చేస్తుంది. రాత్రి వేళ సమయం చూసుకోకుండా ఇన్ స్టా గ్రామ్ చూస్తుంటే ఈ ఫీచర్ మనకు హెచ్చరికలు జారీ చేస్తుంది. 10 గంటల తరువాత కూడా చూస్తుంటే లాగౌట్ చేసి నిద్ర పోవాలని హెచ్చరిస్తుంది. ఈ మేరకు మెస్సేజ్, నోటిఫికేషన్ ద్వారా సూచనలు చేస్తుంది.

ఇన్ స్టా గ్రామ్ యూజర్స్ తమ స్క్రీన్ టైం తగ్గించుకునేలా ఫీచర్ ను రూపొందించారు. అదే క్వైట్ మోడ్. సమయం చూసుకోకుండా రీల్స్ చూస్తుంటే టైం తెలియదు. అదే పనిగా చూస్తుంటాం. దీని నుంచి బయట పడేందుకు క్వైట్ మోడ్ ను తీసుకొచ్చారు. ఇది మనం ఎక్కువ సేపు చూడకుండా చేయడంలో తోడ్పడుతుందని చెబుతున్నారు.

క్వైట్ మోడ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లండ్, యూకే, కెనడా, అమెరికా లాంటి దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక మీదట గంటల తరబడి ఇన్ స్టా గ్రామ్ లో ఉండాల్సిన పనిలేదు. ఈనేపథ్యంలో ఎక్కువ సేపు సోషల్ మీడియాలో గడిపేందుకు కొన్ని నిబంధనలు తీసుకురావడం గమనార్హం. ఇక సమయం మించి గడిపితే హెచ్చరిస్తుంది.