photo ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల పుణ్యమాని నటీనటుల చిన్ననాటి పిక్ లు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో అవి హల్ చల్ చేస్తున్నాయి. హీరోహీరోయిన్ల పర్సనల్ ఫొటోలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లాంటి వాటిలో పోస్టులు పెడుతుంటే వాటికి లైకులు, షేర్ లు వస్తున్నాయి. చిన్నప్పటి ఫొటోలతోనే వారికి ప్రచారం పెరుగుతోంది.
1980-90ల్లో తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేసిన హీరోయిన్ రాధ. ఆమెకు ఇద్దరు కూతుళ్లు కార్తీక, తులసిలు ఉన్నారు. వారు కూడా తల్లి బాటలోనే నడవాలని అనుకున్నా సక్సెస్ కాలేకపోయారు. కార్తీక నాగచైతన్యతో జోష్ లో ఎంట్రీ ఇచ్చింది. తరువాత దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాల్లో నటించినా గుర్తింపు తెచ్చుకోలేదు. దీంతో అవకాశాలు సన్నగిల్లాయి.
ప్రస్తుతం ఆమె వారి హోటళ్లు చూసుకుంటోంది. తమిళ, కన్నడ, మలయాళంలో పలు సినిమాలు చేసింది. హిందీలో ఆరంభ్ వెబ్ సిరీస్ లో దేవసేనగా నటించింది. గ్లామర్, టాలెంట్ ఉన్నా ఎందుకో సక్సెస్ కాలేదు. దీంతో ఇటీవల యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకుంది. జూన్ 27న పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన చిన్ననాటి పిక్ విడుదల చేసింది.
ఆమె చిన్ననాటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముద్దుగా బొద్దుగా ఉన్న ఆమె ఫొటో చూసి అందరు ముచ్చట పడుతున్నారు. చిన్నప్పుడు ఎంతో అందంగా ఉన్న కార్తీక ఫొటో చూసి అందరు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి కంటే అప్పుడే అందంగా ఉన్నావని చెబుతున్నారు. దీంతో కార్తీక ఫొటో చూసి నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.