Home EXCLUSIVE Anchor Vindhya : తన అభిరుచిని కుటుంబసభ్యులు సపోర్టు చేశారు : యాంకర్ వింధ్య విశాఖ

Anchor Vindhya : తన అభిరుచిని కుటుంబసభ్యులు సపోర్టు చేశారు : యాంకర్ వింధ్య విశాఖ

8
Anchor Vindhya
Anchor Vindhya

Anchor Vindhya : తన అభిరుచిని కుటుంబ సభ్యులు సపోర్టు చేయడంవల్లే తాను కెరీర్ లో రాణిస్తున్నానని యాంకర్ వింధ్య విశాఖ అన్నారు. ఐపీఎల్, ప్రొకబడ్డీ లీగ్ లతో పాటు పలు క్రికెట్ టోర్నమెంట్లకు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తూ విశేష ఆదరణ పొందుతున్నారు వింధ్యా విశాఖ. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే తాను రాణించగలుగుతున్నానని తెలిపారు.

కాలేజీ రోజుల్లోనే కెరీర్ మొదలుపెట్టి.. మోడలింగ్ లోనూ శిక్షణ పొందినట్లు తెలిపారు. కాలేజీ రోజుల్లోనే పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచానని, అప్పట్లోనే మోడలింగ్ చేయాలనే ఆలోచన వచ్చిందని, పలు ఉద్యోగాలు చేసిన తర్వాత మోడలింగ్ లో శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన ఓ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్నానని, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ షో అని, అక్కడి వాతావరణం నచ్చలేదన్నారు. అక్కడ దుస్తులు మార్చుకోవడానికి సరైన రూంలు లేకపోవడంతో షాకయ్యానని అన్నారు. అలాగే తనకు ‘గోపాల గోపాల’, ‘ముకుంద’ చిత్రాల్లో అవకాశం వచ్చినా ఆసక్తి లేక నో చెప్పానని అన్నారు.