Home EXCLUSIVE CM Revanth Reddy : లీడర్ అంటే మీరే.. రేపటి తరానికి మోడల్ సీఎం మీరే..మాటనిలుపుకున్నారు...

CM Revanth Reddy : లీడర్ అంటే మీరే.. రేపటి తరానికి మోడల్ సీఎం మీరే..మాటనిలుపుకున్నారు సార్!

13
Revanth Reddy
Revanth Reddy
Revanth Reddy
Revanth Reddy

CM Revanth Reddy : ఒకప్పుడు హైదరాబాద్ లో సీఎం వస్తున్నారంటే చాలు ఓ పది, ఇరవై కిలోమీటర్లు ట్రాఫిక్ ఆంక్షలు విధించేవారు. దారి పొడవునా పోలీసులను మోహరించేవారు.. బిజీబిజీగా నిత్యం విపరీతమైన ట్రాఫిక్ ఉండే సిటీలో సిగ్నళ్ల దగ్గర వేలాది వాహనాలు నిలిచిపోయేవి. సీఎం ఆ దారంటే వెళ్తున్నారంటే వాహనదారుల ఇబ్బందులు దేవుడికి ముట్టేవి. వానైనా, ఎండైనా సిగ్నళ్ల దగ్గర పడిగాపులు కాయాల్సిందే. ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ కావడానికి గంట, రెండు గంటలు పట్టేవి..

గతంలో సిటీలో సీఎంలు ప్రయాణిస్తుంటే అలా ఉండేది. ప్రస్తుతం ఆ జమానా పోయింది. సీఎం కూడా సర్వసాధారణ ప్రయాణికుడిలా వెళ్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు లేవు.. ట్రాఫిక్ నిలిపివేతలు లేవు..సిగ్నళ్ల దగ్గర పడిగాపులు లేవు.. సీఎం కాన్వాయ్ కూడా మనతో పాటే సాధారణంగా, మనపక్కనే ఏ హడావిడి లేకుండా కదిలిపోతుంటోంది. ఈ మార్పు జనాలను బాగానే కదిలిస్తోంది. ఒకప్పుడు ఎంతో కష్టపడ్డం కదా..అని ఓ నిట్టూర్పు విసురుతున్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత గత సీఎం చేసినట్టుగా అహంకార పూరిత చర్యలకు పోకుండా సీఎం కూడా సాధారణ వ్యక్తే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందులో మొదటిది ప్రగతి భవన్ ను ప్రజాదర్బార్ గా మార్చడం.. తన నివాసంగా ప్రగతిభవన్ వద్దు సొంత ఇంటిలోనే ఉంటానని నిర్ణయించడం. అలాగే తన కాన్వాయ్ కారణంగా సామాన్య జనాలు ట్రాఫిక్ ఇబ్బందులు పడకూడదు.. ట్రాఫిక్ ఆంక్షలు పెట్టకూడదు అని పోలీస్ ఉన్నతాధికారులను వారం కిందట ఆదేశించారు.

సీఎం తన ఆలోచనలను నిన్న బుధవారమే అమల్లోకి తీసుకొచ్చారు. సాధారణ వాహనాల మాదిరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆయన కాన్వాయ్ హైదరాబాద్ లో ప్రయాణించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణ వాహనాల లాగా ఎలాంటి సైరన్ చేయకుండా, ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా సాగిపోవడం.. నిజంగా హైదరాబాద్ వాహనదారులకు ఆనందం కలిగించింది.

సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంస్కరణలు సాధారణ జనాలకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఆయన తన ప్రమాణ స్వీకారం వేళ..‘‘తాము పాలకులం కాదు.. సేవకులం’’ అన్న మాటలను ఇప్పుడు ఆయన నిజం చేస్తూ అమల్లోకి తీసుకొస్తున్నారు. అసాధారణ వ్యక్తులు చేసే సాధారణ పనులే సగటు జనాల్లోకి వేగంగా వెళ్తాయి. ఇప్పడది స్పష్టంగా అందరికీ అర్థమవుతూనే ఉంది. దీంతో కాంగ్రెస్ క్యాడర్ ఖుషీ అవుతూ ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నాయి. రేపటి తరానికి మోడల్ మీరే సీఎం గారూ.. అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.  ఆ వీడియో మీరు కూడా చూడండి మరి..