NTR District : ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులుగా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లిస్టును విడుదల చేశారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో భారీ స్థాయిలో మార్పులు ఉండబోతున్న అన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
నందిగామ వైసిపి ఇన్చార్జిగా అమర్లపూడి కీర్తి సౌజన్య, తిరువూరు వైసిపి ఇన్చార్జిగా మొండితోక జగన్ మోహన్ రావు, మైలవరం వైసీపీ ఇన్చార్జిగా దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జిగా వసంత కృష్ణ ప్రసాద్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా స్వామినేని ఉదయభాను నియమించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. భారీ మార్పులు నేపథ్యంలో జిల్లాలో అసంతృప్తి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది మొత్తం మీద ఎన్టీఆర్ జిల్లా లిస్టు రేపు రిలీజ్ అవుతుండడంతో అక్కడ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.