
Modi Mind game : ప్రధాని మోదీ అమెరికా పర్యటన కొనసాగుతున్నది. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రెండు దేశాల ద్వైపాక్షిక చర్చలు ఈ సందర్భంగా కొనసాగాయి. భద్రతా, రక్షణాపరమైన ఒప్పందాలు చేసుకున్నారు. అయితే అక్కడి అమెరికన్ కాంగ్రెస్ సభలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. పలు దేశాల విషయంలో భారత్ వైఖరిని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. మరికొన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.
అంతకుముందు పలువురు అంతర్జాతీయ జర్నలిస్టులు రష్యా విషయంలో భారత్ వైఖరిపై మోదీని ప్రశ్నించారు. కానీ దీనిపై మోదీ వారితో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అనంతరం అమెరికన్ జాతీయ కాంగ్రెస్ లో తన ప్రసంగంలో దీనికి ధీటైన సమాధానమిచ్చారు. భఆరత్ ఎలాంటి వైఖరిని అవలంబిస్తుందో ఘాటుగా చెప్పారు. ఉక్రెయిన్ రష్యా యుద్దాన్ని తాము ఖండిస్తు్న్నామని చెప్పారు. ఈ యుద్దం వల్ల జరిగే నష్టం, పరిణామాలను ఇరు దేశాలతో మాట్లాడినట్లు తెలిపారు. అయితే ఉక్రెయిన్, రష్యాలకు తమ స్నేహహస్తం అలాటే ఉంటుందని చెప్పారు. ఇది తమ దేశానికి సంబంధించిన అంశమని ఒకస్థాయిలో ఘాటుగానే మాట్లాడారు. అయితే యుద్దాన్ని తాము కోరుకోబోమని, శాంతియుత మార్గంలో వివాదాలను పరిష్కరించుకోవాలని ఆ రెండు దేశాలకు సూచించామని చెప్పారు.
అయితే అమెరికా గడ్డపై మోడీ ఇలా ప్రతిస్పందించడం అందరినీ అశ్చర్యానికి గురి చేసింది. ఇది మోదీ స్థాయి మైండ్ గేమ్ అంటూ పలువురు అభిప్రాయపడ్డారు. ఒకవైపు కొన్ని దేశాలు జో బైడెన్ తో కలిసి మోదీపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తుంటే ఏకంగా విదేశీ గడ్డపైనే అమెరికా రష్యా బంధంపై భారత్ ప్రధాని మోదీ స్పష్టం చేయడం ఇరు దేశాల బంధాన్ని చెప్పారు. అదే విధంగా అమెరికాతోనూ తమ స్నేహబంధం కొనసాగుతుందని మోదీ చెప్పారు. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ఎప్పటికి ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతాయని, మిత్ర బంధాన్ని అతిక్రమించబోమని చెబుతూనే రష్యాపై భారత వైఖరిని స్పష్టంగా తేల్చేశారు.